వర్షంతో బయటపడ్డ నిజం : భర్తను ఇంటిముందే పూడ్చిపెట్టింది

WIFE DEATHభార్యాభర్తల గొడవలో చనిపోయిన భర్తను ఇంటిముందే పూడ్చిపెట్టింది ఓ మహిళ. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మృతదేహం కుళ్లి వాసనరావడంతో, శవాన్ని మరోచోటుకి తరలించడంలో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకెళితే..మేడ్చల్ జిల్లాలోని శామిర్ పేట మండలం కేశవరానికి చెందిన మల్లేష్‌ ,జ్యోతి దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. గత కొంత కాలంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మే 3న మద్యం మత్తులో ఉన్న మల్లేష్, భార్యతో గొడవపడ్డాడు.

దీంతో జ్యోతి అతడిని తోసివేయడంతో కిందపడిన మల్లేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎంతకూ లేవకపోవడంతో భర్త మృతిచెందాడని గుర్తించి ఆందోళనకు గురైన ఆమె శవాన్ని ఇంటి ఆవరణలోనే గోయ్యి తీసి పూడ్చిపెట్టింది.  వర్షం కురవడంతో మృతదేహం కుళ్లి దుర్వాసన రావడంతో ఆమె జూన్ 2న అర్ధరాత్రి శవాన్ని బయటకుతీసి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల గోతిలో పారవేసింది.  గుర్తుతెలియని  మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మామిండ్ల మల్లేష్‌గా గుర్తించారు.

దీంతో మల్లేష్‌ భార్య జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జ్యోతిని నిందితురాలిగా గుర్తించి మంగళవారం (జూన్-12) రిమాండ్‌ కు తరలించారు. అయితే కావాలని తాను చంపలేదని, తనను కొట్టడానికి వస్తున్న క్రమంలోనే తన భర్త కిందపడి మరణించాడని, తనా జైలుకెళ్తే పిల్లల భవిష్యత్ ఆగం అవుతుందనే జ్యోతి చెప్పినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy