వానల్లేవ్….బువ్వల్లేవ్ !

img1101222033_1_1వర్షాలు లేని పరిస్థితులు….నిత్యావసరాల ధరలపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. సకాలంలో వర్షాలు పడకపోవటంతో…పంటల ఉత్పత్తి భారీగా పడిపోయింది. దీంతో…పప్పులు, బియ్యం ధరలు మండిపోతున్నాయి. సామాన్యులు ఎక్కువగా కొనే పెసరపప్పు ధర ఆల్ టైమ్ హై కి చేరింది. గత సంవత్సరం 66 ఉన్న పెసర పప్పు ధర 115 కు చేరింది. మినపపప్పు, కందిపప్పు ధరలు మాల్స్ లో దాదాపు వందకు చేరాయి. గతేడాది 29 ఉన్న సాధారణ బియ్యాన్ని 36కు అమ్ముతున్నారు. సన్నబియ్యం 48 నుంచి 50 రూపాయల వరకు సేల్ చేస్తున్నారు. ప్రతియేటా 5లక్షల హెక్టార్లలో కంది, పెసర, మినుము, శెనగ తోపాటు…ఇతర పప్పుధాన్యాలు సాగవుతాయి. వర్షాలు పడకపోవటంతో 3.45 హెక్టార్లలోనే సాగయ్యాయి. 10 లక్షల హెక్టార్లు సాగయ్యే వరి… 8లక్షల హెక్టార్లకే పరిమితమైంది. వర్షాలు పడకపోవడానికి కరెంటు కోతలు కూడా తోడవడంతో  పంటల దిగుబడి తగ్గిపోయింది. ఖరీఫ్ నిండా ముంచటంతో.. రబీ పరిస్థితి ఎలా ఉంటుందనే ఆందోళన మొదలైంది. కొత్త పంట వచ్చే పరిస్థితి లేనందున.. పప్పులు, బియ్యం ధరలు మరింత పెరగే చాన్స్  ఉందంటున్నాయి మార్గెట్ వర్గాలు.

 

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy