వర్సిటీల సమస్యలపై కదిలిన సర్కార్

kadaytamయూనివర్సిటీల్లో ఇంచార్జీల పాలనకు చెక్ పెట్టాలని చూస్తోంది సర్కార్. ప్రతిపక్షాల విమర్శలతో రెగ్యులర్ వీసీల నియామకంపై నజర్ పెట్టింది. వర్సిటిల్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు ట్రై చేస్తోంది. ఫెసిలిటీస్ కల్పించి స్టూడెంట్స్ ఇబ్బందులను తొలగించాలనుకుంటోంది. ఇవాళ ఉన్నత విద్యామండలి నిర్వహించే మీట్ లో చాలా అంశాలపై క్లారిటీ ఇవ్వనుంది సర్కార్.

యూనివర్సిటీల్లోని సమస్యలను స్టెప్ బై స్టెప్ సెట్ చేయాలనుకుంటోంది సర్కార్. ఇవాళ అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్ లతో ఉన్నత విద్యామండలి నిర్వహించే సమావేశం ఇందుకు వేదిక కానుంది. విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తో పాటు విద్యాశాఖ అధికారులు ఇందులో పాల్గొననున్నారు. యూనివర్సిటీల సమస్యలపై చర్చించనున్నారు. వీసీల నియామక చట్టంలో మార్పులు తెచ్చిన సర్కార్.. పోస్టింగ్స్ ఎప్పుడు ఇవ్వనుందనే దానిపై ఈ సమావేశంలో క్లారిటీ ఇచ్చే చాన్సుంది. హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా చర్చించనున్నారు. యూనివర్సిటీల్లో లైబ్రరీ ఫెసిలిటితో పాటు కనీస వసతులు ఎలా ఉన్నాయన్న దానిపై డిస్కస్ చేయనున్నారు. ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమంటోంది సర్కార్. అయితే సమావేశాలు నామమాత్రంగా కాకుండా, పరిష్కారం దిశగా ఉండాలంటున్నారు విద్యావేత్తలు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy