వర్సిటీ రీసెర్చ్ : లైకుల కోసం హింసించుకుంటున్నారు

flat,800x800,070,f.u3ఉదయం లేస్తూనే గుడ్ మార్నింగ్ తో మొదలు..గుడ్ నైట్ వరకు అనేక రకాల పోస్టులతో ఆకట్టుకోవాలని చూస్తారు. ఇది మంచి పనికి అయితే ఓకే కానీ..రానురాను ఈ లైకుల వ్యవహారం సూసైడ్ వరకు దారితీస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. సోషల్‌ మీడియాలో లైకుల కోసం యుక్తవయస్కులు తమను తాము గాయపర్చుకునే పద్ధతి ఆందోళనకర రీతిలో పెరుగుతోందని అధ్యయనంలో గుర్తించారు. కోసుకోవడం, కాల్చుకోవడం, ఇలా తమను తాము హింసించుకున్న వీడియోలను పోస్టు చేస్తే సోషల్‌ మీడియాలో లైకులెక్కువే. ఇలాంటివి ఆత్మహత్యలతో ముడిపడి ఉన్నాయని భారత సంతతి శాస్త్రవేత్తతో కూడిన ఫ్లోరిడా అట్లాంటిక్‌ వర్సిటీ పరిశోధకుల బృందం తెలిపింది. 2013లో ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల బాలిక మొదటిసారిగా స్వీయ హాని ఘటనలకు తెరలేపిందట. 6 వేల మంది విద్యార్థులపై పరిశోధన చేయగా, ప్రతి 20 మందిలో ఒకరు ఇలాంటి ఘాతుకాలకే పాల్పడుతున్నట్లు గుర్తించారట.

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy