వాగు వంతెనపై నుంచి అదుపు తప్పి బస్సు బోల్తా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం వద్ద సారపాక-నాగినేనిప్రోలు మార్గంలో ఆర్టీసీ బస్సు వాగు వంతెనపైనుంచి అదుపు తప్పి బోల్తా పడింది. ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం వల్ల దెబ్బతిన్న రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించబోయాడు బస్సు డ్రైవర్. అయితే  బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడిపోయింది.

ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో పది మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్తండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెపుతున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy