వాజ్ పేయి ఆజన్మ బ్రహ్మచారి.. ఇంతకీ ఎవరీ రాజ్ కుమారీ కౌల్..?

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి ఆ జన్మబ్రహ్మచారి. ఈ విషయంలో ఎవరికీ సందేహంలేదు. ఐతే.. ఆయనకు వ్యక్తిగతంగా దగ్గరైన వాళ్లు ఎవరు అనేది ఆసక్తి కలిగించే అంశం. దీనిపై పలు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ కథనాల్లో ప్రముఖంగా వినిపించే పేరే రాజ్ కుమారి కౌల్. మరి ఆమెవరు?

రాజ్ కుమారి కౌల్ ఎవరో కాదు. వాజ్ పేయి దత్తత తీసుకున్న నమితా భట్టాచార్య కౌల్ తల్లి. నమిత చిన్నతనంలో ఉన్నప్పుడే వాజ్ పేయి ఆ పాపను తన కూతురుగా దత్తత తీసుకున్నాడు. పాపను వాజ్ పేయి అడాప్ట్ చేసుకున్నప్పటినుంచి…. రాజ్ కుమారి కౌల్ కూడా వాజ్ పేయి కుటుంబంలో సభ్యురాలైపోయింది. ఇంతకీ వాజ్ పేయి.. రాజ్ కుమారి కౌల్ బిడ్డనే ఎందుకు దత్తత తీసుకున్నారు..?

రాజ్ కుమారి కౌల్ భర్త బీఎన్ కౌల్ చనిపోవడంతో వాళ్ల కుటుంబం ఒంటరిదయ్యింది. బీఎన్ కౌల్ ప్రొఫెసర్ గా పనిచేస్తుండేవారు. రామ్జాస్ కాలేజీ ఫిలాసఫీ డిపార్టుమెంట్ హెడ్ గా కూడా పనిచేశారు. బలరామ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు వాజ్ పేయి.. బీఎన్ కౌల్ ను కలుసుకున్నారు. బీఎన్ కౌల్ చనిపోవడంతో… రాజ్ కుమారి  కూతురుని వాజ్ పేయి దత్తత తీసుకున్నారు. వాజ్ పేయికి.. రాజ్ కుమారి కౌర్ కు పాత పరిచయం ఉందా…?

వాజ్ పేయి, రాజ్ కుమారి కౌల్ ఇద్దరూ కాలేజ్ మేట్స్. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ ప్రామినెంట్ విక్టోరియా కాలేజీలో వీళ్లిద్దరూ కలిసి చదువుకున్నారు. ఈ కాలేజీ పేరు ఇపుడు లక్ష్మీబాయి కాలేజీగా మారింది. వాళ్లిద్దరు క్లాస్ మేట్స్ అని వాజ్ పేయి బంధువులు కూడా చెబుతారు. గ్వాలియర్ జిల్లాలోని మోరార్ అనే పల్లెటూరి నుంచి రాజ్ కుమారి కౌర్ కుటుంబం… గ్వాలియర్ కు వలస వచ్చింది. కాలేజీ అయ్యాక మళ్లీ ఎప్పుడు కలుసుకున్నారు..?

బీఎన్ కౌల్ తో పెళ్లి తర్వాత రాజ్ కుమారి కౌర్ .. కుటుంబసభ్యులతో ఢిల్లీలో సెటిల్ అయింది. అక్కడే వాజ్ పేయితో మరోసారి పరిచయం అయింది. ఒత్తిడిలో ఉన్నవారికి ఉచితంగా వైద్యసేవలు అందిస్తూ ఉండేది రాజ్ కుమారి కౌల్. ప్రభుత్వ దవాఖానాలు.. ముఖ్యంగా ఎయిమ్స్ లో తనకున్న పరిచయాలతో.. ప్రత్యేక క్యాంపులు పెట్టించేది. రాజ్ కుమారి కౌల్ భర్త చనిపోయినప్పుడు వారి కుమార్తె నమితా భట్టాచార్యను వాజ్ పేయి దత్తత తీసుకున్నారు. నమితా భట్టాచార్యను తన కూతురుగా వాజ్ పేయి చెప్పినప్పటినుంచీ.. మిసెస్ కౌల్ కుటుంబసభ్యులు సెవన్, రేస్ కోర్స్ రోడ్ లోని ప్రధాని నివాసంలోనే ఉంటున్నారు.

కొన్నేళ్లకిందటే ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మిసెస్ కౌల్ చనిపోయింది. అప్పుడు ఆమె వయస్సు 86 ఏళ్లు. ఆమె చనిపోయినప్పుడు వాజ్ పేయి కుటుంబసభ్యురాలు అని ఎయిమ్స్ మెడికల్ రిపోర్టులో రాశారు. మిసెస్ కౌల్ కు ఇద్దరు కూతుళ్లు. ఒకరు నమిత.. మరొకరు నాని. ఆమె మనవరాలు నిహారిక కూడా వాజ్ పేయి నివాసంలోనే ఉంటున్నారు. వాజ్ పేయి అంతిమ సంస్కారాలను నమిత, నిహారిక సహా కుటుంబసభ్యులందరి చేతులమీదుగానే నిర్వహించారు.

జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్న వాజ్ పేయి పెళ్లిపై అడిగినప్పుడు సరదాగా స్పందించేవారు. పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగినప్పుడు .. అంతటి తీరిక లేదని చెబుతుండేవారు అటల్ జీ. స్నేహితురాలి కుటుంబాన్ని చేరదీసి ఆసరాగా నిలిచారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy