వాజ్ పేయి ప్రకటన తర్వాతే చంద్రయాన్-1

ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో సగర్వగా చంద్రుడిపైకి నిర్వహించిన ప్రయోగం చంద్రయాన్-1. భారత్ నిర్వహించిన ఈ ప్రయోగం తోనే… చంద్రుడిపై నీటిజాడ విషయంలో ప్రపంచానికి స్పష్టత వచ్చింది. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలకు ఇస్రో చేపట్టిన తొలి ప్రాజెక్టు కూడా ఇదే. భారత దేశానికే గర్వకారణంగా నిలిచిన ఈ ప్రయోగం గురించి జాతికి మొదట తెలిపింది అటల్ బిహారీ వాజ్ పేయే.

2003.. ఆగస్టు పదిహేనో తేదీన అప్పటి ప్రధాననమంత్రి వాజ్ పేయి జాతీయ జెండాను ఎగరేసి జాతినుద్దేశించి ఢిల్లీలో ప్రసంగించారు. ఆయన చేసిన ప్రసంగంలోనే చంద్రయాన్ గురించి వివరించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ త్వరలోనే ఓ ప్రయోగం చేయబోతోందని.. ఇది దేశానికే గర్వకారణంగా నిలవబోతోందని చెప్పారు. వైజ్ఞానిక రంగంలో భారత్ మరో కీలక అడుగు వేయబోతోందని.. చంద్రయాన్ ప్రథమ్ పేరుతో చంద్రుడిపైకి వ్యోమనౌకను పంపిస్తున్నామని… ఈ విషయం చెప్పేందుకు సంతోషంగా ఉందని వాజ్ పేయి చెప్పారు.

ఆ తర్వాత శ్రీహరికోట నుంచి 2008 అక్టోబరు 22న చంద్రయాన్-1 ను ప్రయోగించారు. మొదట ఇస్రో ప్రణాళికలో లేనప్పటికీ… డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సూచనలతోనే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ను చంద్రయాన్ 1లో భాగం చేశారు. అలా… చంద్రయాన్ 1 తో పంపిన ఉప్రగ్రహం.. 2008 నవంబర్ 14న చందమామపై అడుగుపెట్టింది.

రెండేళ్లపాటు సాగాల్సిన మిషన్‌.. 10 నెలల్లోపే ముగిసింది. కానీ ఈ ప్రయోగమే ప్రపంచానికి కొత్త విషయం చెప్పింది. చంద్రుడిమీద నీళ్లున్న సంగతిని మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ధ్రువీకరించింది. చంద్రుడి కక్ష్యలోకి చేరిన ఉపగ్రహం.. 2009 మార్చి 25న భూమి ఫొటోను కూడా తీసి పంపింది. అదే ఏడాది మే 19న దాని కక్ష్యను.. చంద్రుడిపై 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి 200 కిలోమీటర్ల ఎత్తుకు పెంచారు. ఆ తర్వాత.. ఆగస్టు 29న ఉపగ్రహంతో కమ్యూనికేషన్‌ తెగిపోయింది. (ఆ తర్వాత నాసా దాని ఆచూకీని తెలిపింది) చంద్రయాన్‌-1 తనకు అప్పగించిన పనుల్లో 95 శాతాన్ని అప్పటికే పూర్తిచేసింది కాబట్టి.. ప్రయోగం సక్సెస్ అయినట్టు ఇస్రో తెలిపింది. వచ్చే ఏడాది జనవరిలో చంద్రయాన్-2 కు సిద్ధమవుతోంది.

వాజ్ పేయి ప్రసంగం కింద ఫేస్ బుక్ లింక్ లో చూడొచ్చు.

Atal Bihari Vajapayee – Indian Mission to Moon – 15 Aug 2003 Independence Day Speech

As Tribute Remembering Honorable former Prime Minister of India Shri Atal Bihari Vajpayee announcement of Indian Mission to Moon on Independence Day 15 Aug 2003 . We Present following Video Courtesy Govt Of India Source. Following the announcement of P.M. in year 2008 on 22 Oct 2008 Chanddrayaan I was launched and was placed into orbit of Moon on 8 Nov 2008. Later as part of this Mission following suggestion of Dr.A.P.J. Abdul Kalam a "Moon Impact Probe" which was included as part (not orginally planned) of this Mission which landed on surface of Moon on 14 Nov 2008. Importantly presence of Water on Moon was confirmed because this mission telling new truth to world. Hats off to the then Prime Minister and Team ISRO. #atalbiharivajpayee

Planetary Society, India 发布于 2018年8月16日周四

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy