వాటర్ కనెక్ట్ యాప్: ఒక్క క్లిక్ తో నల్లా కనెక్షన్

nallaహైదరాబాద్  గ్రేటర్ ప్రజలు నల్లా కనెక్షన్ కోసం ఇక పై ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం….గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.నల్లా కనెక్షన్ కోసం ప్రజలు పడే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని… జలమండలి వాటర్‌ కనెక్ట్‌ యాప్‌ ప్రవేశపెట్టింది. ఇక నుంచి గృహ వినియోగ (డొమెస్టిక్‌) నల్లాల కోసం ఇంటి నుంచే ఒక్క మొబైల్‌ క్లిక్‌తో నల్లా కనెక్షన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు అవసరమైన ఇంటి నిర్మాణ ప్లాన్, సేల్‌డీడ్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ డాక్యుమెంట్లను స్కాన్‌ చేసి మొబైల్‌ ద్వారానే అప్‌లోడ్‌ చేసే అవకాశం కల్పించింది. ఈ వాటర్‌ కనెక్ట్‌ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

ఈ యాప్‌ ద్వారా దరఖాస్తులను సమర్పించిన వినియోగదారులకు 15 రోజుల్లో నల్లా కనెక్షన్‌ జారీ కానుంది. గురువారం(మార్చి-22) ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో మున్సిపల్‌ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, ఎండీ దానకిశోర్‌లు ‘వాటర్‌ కనెక్ట్‌’ యాప్‌ను ఆవిష్కరించారు. ఇంకుడు గుంతలపై మరింత సమాచారం అందజేసేందుకు జలమండలి రూపొందించిన జలంజీవం యాప్, జలంజీవం వెబ్‌సైట్లనూ ప్రారంభించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy