వాట్సప్ కొత్త ఫీచర్: నెంబర్ సేవ్ చేసుకోకుండానే మెసేజ్

whatsappవాట్సప్ మెసేజ్ ప్రస్తుతం కామన్ అయ్యింది. SMSలు, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్‌తో పాటు ఫొటోలు, వీడియోలు షేరింగ్‌కు కూడా వాట్సాప్‌ ఎంతగానో ఉపయోగపడుతోంది. మనం పంపించిన మెసేజ్‌లు అవతలివాళ్లు చూశారో.. లేదో అనే విషయాన్నికూడా తెలుసుకునే సదుపాయం ఉండడంతో ఇంటర్‌నెట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌నే ఉపయోగిస్తున్నారు. అయితే వాట్సప్ ద్వారా మనం ఎవరికైనా మెసేజ్ చేయాలంటే తప్పని సరిగా వాళ్ల మొబైల్ నంబర్‌ను మన ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి. ప్రస్తుతం  ఆ అవసరం కూడా లేకుండానే మెసేజ్ చేసే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఇందుకోసం క్లిక్2చాట్ వాట్సాప్ యాప్ ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లే స్టోర్ నుంచి క్లిక్2చాట్ వాట్సాప్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే నంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్ నుంచి మెసేజ్ పంపొచ్చు. కేవలం 2.8 ఎంబీ సైజ్ ఉన్న Click2Chat యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాక అందులో రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓపెన్ చేశాక ఏ నంబర్‌కైతే మెసేజ్ పంపించాలనుకుంటున్నామో ఆ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత పంపించాల్సిన మెసేజ్‌ను టైప్ చేసి కింద ఎడమవైపున ఉన్న ‘Send Now’ బటన్‌ను క్లిక్ చేయాలి. సెండ్ నౌ బటన్‌ను క్లిక్ చేశాక వచ్చే ఆప్షన్స్‌లో వాట్సాప్ సింబల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా వాట్సాప్‌ నుంచి మెసేజ్ పంపించుకునే అవకాశం ఉంటుంది. క్లిక్2చాట్ వాట్సాప్ యాప్‌లో మరో సదుపాయం కూడా ఉంది. నంబర్‌ను ఎంటర్ చేయకుండా కాల్‌లిస్ట్‌లో ఉన్న నంబర్‌ను కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అదనంగా ట్రాన్స్‌లేషన్, జోక్స్ సదుపాయాలు కూడా ఉన్నాయి. అంతేకాదు ఇందులో మెసేజ్‌ను షెడ్యూల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. బర్త్ డేలు… ఇతర స్పెషల్ డేస్‌లో ఏ టైమ్‌కు ఎవరికి మెసేజ్ చేయాలో ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇందుకోసం కింది భాగంలో కుడివైపున ఉన్న Send Later ఆప్షన్‌ను ఎంచుకోవాలి. Send Laterపై క్లిక్ చేశాక డేట్.. టైమ్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త వాట్సప్ ఫీచర్ తో వినియోగదారులు మరింత ఈజీగా మెసేజ్ లు పంపించుకునే అవకాశముంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy