వాట్సప్ లో ‘తలాక్’ చెప్పేశాడు

whatsapp-t-581x330ఆ వాట్సప్ మెసేజ్ ఎంత పని చేసింది. తలాక్.. తలాక్.. తలాక్.. అనే మూడు పదాలు పెళ్లై పది రోజులు కాని ఆ యువతికి గంపెడు దుఃఖాన్ని మిగిల్చాయి. ఈ మెసేజే పంపాడు ఆమె భర్త. ఎంతో ఆనందంగా.. ఊరందరిని పిలిచి.. చేసుకున్న నిఖాను వాట్స్ యాప్ మెసేజ్ ద్వారా మూడు మాటల్లో తేల్చి అవతల పడేశాడు ఆ ఘనుడు. కేరళలో జరిగింది ఈ ఇన్సిడెంట్. కేరళలోని కొట్టాయంకు చెందిన 21 ఏళ్ల అమ్మాయి దుబాయ్ లో ఉంటున్న యువకుడిని మ్యారేజ్ చేసుకుంది. ముస్లీం సంప్రదాయం ప్రకారం… ఎంతో ఆనందంగా.. సంబరంగా జరిగింది ఆ వివాహం. మ్యారేజ్ అయిన తర్వాత దుబాయ్ వెళ్లిపోయాడు ఆ అబ్బాయి. ఒక రోజు.. రెండు రోజుల.. ఇలా పది రోజులు గడిచాయి. ఎంత కాలం అయినా… అటు నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదు. ఫోన్లు లేవు… మెసేజ్ లు లేవు. దీంతో ఏదో అనుమానం కలిగి.. మెసేజ్ చేసింది ఆ యువతి. ఆ మెసేజ్ చేసిన కొద్ది సేపటికే మైండ్ బ్లాంక్ అయ్యే ఓ మెసేజ్ వచ్చింది. వాట్సప్ లో వచ్చిన ఆ మెసేజ్ ఇలా ఉంది. “నువ్వంటే నాకు ఇష్టం లేదు. నాకోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. మనకు యాపిల్ అంటే ఇష్టమని రోజూ దాన్నే తింటామా ఏమిటి? వేరే పండ్లనూ తింటుంటాం కదా.. తలాక్… తలాక్.. తలాక్…” ఈ మెసేజ్ చూసిన వెంటనే ఆ అమ్మాయి నోట మాటరాక అలాగే ఉండిపోయింది. ఇంక ఇలా ఉంటే.. కుదరదనుకొని.. కేరళ మహిళా సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇప్పుడా వాట్సప్ తలాక్ గాడిపై పోరుకు రెడీ అంటోంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy