ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వాట్సాప్ ఇన్ కార్పోరేషన్ సంస్థ.. ఇండియాలో డిజిటల్ పేమెంట్సే దిశగా అడుగులు వేస్తోంది. చిన్న, మధ్యతరహా వ్యక్తులతోపాటు అత్యధికంగా యూత్ ను ఆకట్టుకుంటున్న వాట్సాప్ గ్రూప్.. ఇన్ స్టాంట్ మెసేంజింగ్ యాప్ ద్వారా విప్లవం తెచ్చింది. ఇప్పుడు మరో మైలురాయిని సొంతం చేసుకోబోతోంది. వాట్సాప్ లోని స్నేహితులకు ఆన్ లైన్ లో డబ్బులు పంపేందుకు, ఇక ఇతర P టు P (ఫోన్ టూ ఫోన్), P టు A ( ఫోన్ టూ అకౌంట్) సర్వీసులను వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
నోట్ల రద్దు అనంతరం దేశాన్ని క్యాష్ లెస్ సొసైటీగా మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటలైజేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పుడు వాట్సాప్ డిజిటల్ పేమెంట్ ను ఆచరణలోకి తీసుకురానున్నట్టు వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రియాన్ యాక్టన్ వెల్లడించారు. త్వరలోనే దేశంలోని అన్ని ప్రాంతాలకు పేమెంట్ సేవలను విస్తరిస్తామన్నారు బ్రియాన్. వాట్సాప్ డిజిటల్ పేమెంట్ అందుబాటులోకి వస్తే ఇప్పుడున్న సంస్థలపై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.