వాట్సాప్ లో కొత్త ఫీచర్


సోషల్ మీడియాలో ఫార్వార్డ్ అవుతున్న ఫేక్ మెసేజ్ లలో ఉండే లింక్ వల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారానికి ప్రమాదం ఏర్పడుతుండటంతో దీనికి చెక్ పెట్టేందుకు ఓ సరికొత్త ఫీచర్ తో యూజర్ల ముందుకు రాబోతుంది వాట్సాప్. సస్పీషియస్ డిటెన్షన్ లింక్ పేరుతో ఓ ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు వచ్చే మెసేజ్‌ లలో ఉండే లింక్‌ లు ఒరిజినలా, డూప్లికేటా, ఆ లింక్ ఓపెన్ చేయడం ప్రమాదకరమా, కాదా అనే విషయం మనకు తెలుస్తుంది. ఒకవే ళలింక్‌ లు ప్రమాదకరమైనవైతే అవి ఉన్న మెసేజ్‌ లపై వాట్సాప్ అలర్ట్ ఐకాన్‌ ను చూపిస్తుంది. దీంతో యూజర్లు ఆ లింక్‌ ను ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడవచ్చు. ప్రస్తుతం బీటా యూజర్లకు అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy