వానకాలం విత్తనాల ధరలు ఖరారు

SEEDSAవానకాలం పంటల సీజన్‌ లో రాయితీపై విక్రయించే సోయాచిక్కుడు, జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాల ధరలను వ్యవసాయశాఖ ప్రకటించింది. 2017తో పోలిస్తే విత్తనాల ధరలు బహిరంగ మార్కెట్లో పెరిగాయి. పెరిగిన విత్తన ధరలు రైతుకు భారం కాకూడదనే ఉద్దేశంతో రాయితీ చెల్లించేందుకు వ్యవసాయశాఖ ముందుకు వచ్చింది. 2017లో పచ్చిరోట్ట (జనుము, పిల్లిపెసర, జీలుగ) విత్తనాలపై 50 శాతం రాయితీ ఉండగా.. దానిని 65 శాతానికి పెంచారు.

అలాగే సోయాబీన్ విత్తనాలపై 33.33 శాతం నుంచి 37 శాతానికి రాయితీని పెంచారు. జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను ఉత్తరప్రదేశ్ నుంచి, సోయా విత్తనాలను మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వ్యవసాయశాఖ కొనుగోలు చేస్తున్నది. ఉత్తరప్రదేశ్‌ లో పోయిన సంవత్సరం ఈపంటలు దెబ్బతినడంతో విత్తనకొరత ఏర్పడటంతో ధరలు కొంతమేర పెరిగాయి. జీలుగ క్వింటాల్ ధర 2017లో 4 వేల100 కాగా.. ఈ ఏడాది 7 వేల100గా ఖరారు చేయడంతో రాయితీని రూ.2వేల050 నుంచి రూ.4వేల615కి పెంచి రైతు చెల్లించే ధర రూ.2వేల485గా నిర్ణయించారు.

పిల్లిపెసర ధర గతేడాది రూ.11వేల900 ఉండగా ఈ ఏడాది రూ.13వేల500కు పెరగడంతో రాయితీని రూ.8వేల775కు పెంచారు. రైతు చెల్లించాల్సిన ధర రూ.4వేల725గా నిర్ణయించారు. సోయా విత్తనాల ధర రూ.5వేల475 నుంచి రూ.5వేల800కు పెరగడంతో రాయితీని రూ.2వేల146కు పెంపుదల చేసి రైతు చెల్లించాల్సిన ధరను రూ.3వేల654గా నిర్ణయించారు. అలాగే జనుము విత్తనాల ధర రూ.5వేల700 నుంచి రూ.8 వేలకు పెరగడంతో రాయితీని రూ.5వేల200గా ప్రకటించింది. రైతు రూ.2వేల800 ధర చెల్లించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రకటించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy