వానరానికి కన్నడిగుల అంతిమ సంస్కారం

monkey-funeralకారు ప్రమాదంలో మృతి చెందిన కోతికి శవ సంస్కారం చేశారు యువకులు. ఆంజనేయుడ్ని అమితంగా పూజించే కర్ణాటకలోని హంపీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శనివారం ఓ కోతిపిల్ల కారు ప్రమాదంలో చనిపోయింది. ఈ సంఘటన హంపీ పక్కనే ఉన్న కమలాపురలో జరిగింది. రోడ్డు దాటుతున్న కోతిని ఓ కారు ఢీకొంది. వెంటనే స్థానిక యువకులు స్పందించారు. కమలాపుర నుంచి హంపీకి వెళ్లే దారిలో ఉన్న కోటె ఆంజనేయ ఆలయం దగ్గర కోతిపిల్లకు శవసంస్కారం చేశారు. అక్కడ సమాధి కూడా కట్టిస్తామని ఆ యువకులు పేర్కొన్నారు.

రామాయణంలో కర్ణాటక రాష్ట్రంలోని హంపీ, కిష్కింద, అంజనాద్రి పర్వతం, మధువనాల ప్రస్తావన వస్తుంది. కిష్కింద అంటే వానరుల సామ్రాజ్యం. హంపీ పక్కనే అంజనాద్రి పర్వతం ఉంది. అక్కడే ఆంజనేయుడు పుట్టాడని భక్తుల విశ్వాసం. ఈ ప్రాంతంలో పెద్దఎత్తున కోతులు సంచరిస్తుంటాయి. వాటిని స్థానికులు హనుమంతుడిగానే పూజిస్తారు. శనివారం ఆంజనేయుడి భక్తులకు ఎంతో ప్రీతిపాత్రం. అదే రోజు ప్రమాదం జరగడంతో శవ సంస్కారం చేశారు ఆ యువకులు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy