వామ్మో ఇంత డబ్బా : ఆ ఎంపీ ఆస్తి రూ.4వేల కోట్లు

pkమహేంద్ర ప్రసాద్(78). అందరూ ముద్దుగా కింగ్ మహేంద్ర అని పిలుస్తారు. ప్రస్తుతం ఈయన రాజ్యసభ ఎంపీ. అంతేకాదండీ ధనవంతుడైన MPగా రికార్డ్ క్రియేట్ చేశారు. బీహార్  జేడీయూ పార్టీ అభ్యర్ధిగా ఆయన మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. ఎలక్షన్ అఫిడవిట్ లో ఆస్తులు(కంప్యూటర్లు, జ్యువెలరీ, వెహికల్స్, మెదలైనవి) ప్రకటించారు. మెత్తం విలువ 4వేల 10 కోట్లుగా తెలిపాడు.

ఇళ్లు, ఫ్యాక్టరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్లాంట్ మొదలైన ఆస్తుల విలువను 29.1 కోట్లుగా తెలిపాడు. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో ఇన్ కం ట్యాక్స్ రిటర్స్న్ లో తన ఆదాయం రూ.303 కోట్లుగా ప్రకటించారు. 1980లో మొదటిసారిగా ప్రసాద్ జెహనాబాద్ లోక్ సభ స్ధానంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందారు. 1984 జనరల్ ఎలక్షన్స్ ఓడిపోయారు. 1985లో ఆయనను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్ధిగా నామినేట్ చేసింది. అంతే కాకుండా ఎక్కువ దేశాలను సందర్శించిన పార్లమెంటేరియన్ గా ప్రసాద్ రికార్డుకెక్కారు. 211 దేశాలను ప్రసాద్ సందర్శించారు. 2002 ఏప్రిల్ నుంచి 2003 ఏప్రిల్ మధ్య కాలంలో ఒక్క సంవత్సరంలోనే 84 దేశాలను సందర్శించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy