వామ్మో..! ఈ ఫోన్లు మనం కొనగలమా..?

blackberry_porsche_p9981 dior htc_one_gold iphone_5_black_diamond_back_stuart_hughes lamborghini_antares mobiado_pioneer_3 savelli_jardin_secret_white_ice tag_heuer_link_exclusive ulysse_nardin_chairman vertu_constellation_blackఫోన్ అంటే మ్యాక్సిమమ్ ఎంత బెట్టి కొంటారు..? వెయ్యి, 5 వేలు, 20 వేలు.. డబ్బు బాగా ఉంటే లాస్ట్ కు 50 వేలు పెడతారేమో. అంతకు మించి కొనాలని కూడా ఎవరూ అనుకోకపోవచ్చు. ఎందుకంటే దాని బదులు ఓ ల్యాప్ టాప్, బైక్ కొనొచ్చనే ఫీలింగ్ అందరికీ వస్తుంది కదా. దీనికే ఇలా అంటే ఇప్పుడు చెప్పబోయే ఫోన్ల రేట్ తెలిస్తే కళ్లు తిరిగి పడిపోతారేమో. వరల్డ్ లోనే మోస్ట్ ఎక్స్ పెన్సివ్ మొబైల్స్ లిస్ట్ లో యాపిల్ కంపెనీ ప్లాన్ చేస్తున్న గోల్డ్ కలర్డ్ ఐఫోన్ ఒకటి. డైమండ్స్ తో తయారు చేసిన ‘ఐఫోన్ 5 బ్లాక్ డైమండ్’ విలువ వంద కోట్లు. ఈ ఫోన్ ఎవరు కొంటారో తెలియదు కానీ ఇంత కాస్ట్లీ వన్ ను తయారు చేసే యోచన ఉన్నట్లు ఐఫోన్ కంపెనీ ఓ ఫోటో రిలీజ్ చేసింది. దీని తర్వాత డియోర్ రివరీ అనే ఫోన్ వాల్యూ 78 లక్షలు. 1539 డైమండ్స్ యూజ్ చేసి ఈ ఫోన్ ను తయారు చేశారు. కాస్ట్-లీ ఫోన్ లలో  హెచ్.టి.సి వన్-గోల్డ్ ఎడిషన్ కాడా ఒకటి. దీని రేటు 2 లక్షల 75 వేలు. ఇక ఇటాలియన్ లాంబోర్గినిస్ కార్ల కంపెనీ కూడా 2 లక్షల 50 వేల ఫోన్ తయారు చేసింది. కాస్ట్లీ ఫోన్లలో ఒకటిగా ట్యాగ్ హెయర్ లింక్ ఫోన్ ఒకటి. 2011లో రిలీజ్ చేసిన ఈ ఫోన్ విలువ 4 లక్షల 20 వేలు. ఎక్స్ పెన్సివ్ ఫోన్ల లిస్టులో  బ్లాక్ బెరీ పోర్షె పి-9981 మోడల్ కూడా ఉంది. ఈ ఫోన్ కాస్ట్ లక్షా నలభై వేలు.

టాప్ 10 లో ఉన్న మరికొన్ని ఎక్స్ పెన్సివ్ ఫోన్లు :

వెర్టూ కాన్స్ టెలేషన్ 4 లక్షల 16 వేలు, యులిస్సి నార్డిన్ 29 లక్షలు, సావెలిస్ జార్డిన్-సీక్రెట్ వైట్ 6 లక్షలు, మొబ్యాడో గ్రాండ్ 350 పయనీర్ 7 లక్షలు. ఈ ఫోన్ల రేట్లు తెలుసుకున్నాక ఎవరైనా కొనాలనుకుంటారా..? ఏ అంబానీయో, బిల్ గేట్సో కొనాలని సాహసం చేస్తారు గానీ మనలాంటోళ్లు ఈ ఫోన్లు కొంటారా చెప్పండి.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy