వామ్మో : గాలికి తిరగబడిన బస్సు

bus-fall-downపెను తుఫాను వార్ధా.. తమిళనాడులో బీభత్సం సృష్టించింది. గంటకు వంద నుంచి 180 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలులు.. ఆ రాష్ట్ర తీరప్రాంతాన్ని అల్లకల్లోం చేశాయి. గాలి వేగానికి నడుస్తున్న బస్సు సైతం తిరగబడింది. ఓ ఐటీ కంపెనీ ఉద్యోగలతో ఆఫీస్ కు వచ్చిన బస్సు.. గాలి బీభత్సానికి తిరగబడింది. అందరూ చూస్తుండగానే.. కళ్ల ఎదుటే జరిగిన ఈ ఘటన తుఫాన్ గాలి బీభత్సాన్ని చెబుతోంది. గాలి వేగం తగ్గే వరకు బస్సులోని వారు బయటకు రావటానికి భయపడ్డారు. పెద్ద పెద్ద తాళ్ల సహాయంతో బస్సులోని ఉద్యోగులను సేఫ్ గా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటన తొరైబాక్కమ్ ప్రాంతంలో జరిగింది.

భారీ వర్షానికి ఐదు జిల్లాల ప్రజలు వణికిపోయారు. తుఫాను ధాటికి 8 మంది చనిపోగా… 16 వేల మంది నిరాశ్రయులయ్యారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు సర్కార్ నాలుగు లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది.

చెన్నై సహా కాంచీపురం, తిరువళ్లూరు, విళుపురం, కడలూరు జిల్లాలను తీవ్ర తుఫాను కుదిపేసింది. భారీ వర్షానికి మహా వృక్షాలు సైతం నేల కూలాయి. చెన్నై మొత్తం 2 వేల చెట్లు కూలాయి. ఇళ్ల పై కప్పులు, బోర్డులు.. గాల్లో కొట్టుకుపోయాయి. ఉత్తర చెన్నైలోని సముద్రతీర ప్రాంతాలైన కాశీమేడు, తిరువత్తియూరు, ఎన్నూరు వంటి ప్రాంతాలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది జాలర్ల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

తమిళనాడు తీర్ర ప్రాంతాల్లో జనజీవనం స్థంభించింది. 90 ఫైర్ ఇంజన్లు, 20 పడవలతో, 700 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. తుఫాను కారణంగా విమానాల రాకపోకలను నిలిపేశారు. చెన్నై చేరుకోవాల్సిన 25 విమానాలను వివిధ ప్రాంతాలకు దారిమళ్లించారు. సబర్బన్ రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. తిరువల్లూరులో 3, కాంచీపురంలో 2, చెన్నైలో ఒక NDRFబలగాలను రంగంలోకి దించారు. నాలుగు SDRF బలగాలనూ అందుబాటులో ఉంచారు. పుదుచ్చేరిలో సహాయ చర్యలకు మరో బృందాన్ని పంపించారు. ఆర్మీ సహాయక చర్యల్లో పాల్గొంటుంది. కోస్ట్ గార్డ్ కు చెందిన నౌకలను.. గజ ఈతగాళ్లను తీర ప్రాంతాల్లో సిద్ధంగా ఉంచారు.

తమిళనాడులో 18వేల మంది సిబ్బందితో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తున్నారు. గాలులకు కూలిపోయిన చెట్టను తొలగిస్తున్నారు. అమ్మ భోజనం సెంటర్లను 24 గంటలు తెరిచి ఉంచాలని నిర్ణయించారు. భారీ వర్షానికి ప్రజలు ఇళ్ల నుంచి భయటకు రావద్దని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. భారీ గాలికి  విద్యుత్  తీగలు తెగిపోవటంతో చాలా ప్రాంతాల్లో విద్యుత్  సరఫరా నిలిచిపోయింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy