వామ్మో.. : మన దేశం అప్పు రూ.82లక్షల కోట్లు

kcrరాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అప్పులు చేయడం తప్పు కాదన్నారు సీఎం కేసీఆర్. అసెంబ్లీలో మాట్లాడారు సీఎం కేసీఆర్. బడ్జెట్‌పై చర్చ జరుగుతుండగా… బీజేపీ సభ్యులు అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న 21 రాష్ట్రాల్లో  ఆ పార్టీ.. అప్పులు చేయడం లేదా? అప్పులు చేయకుండానే ఆ రాష్ట్రాలు పరిపాలనను కొనసాగిస్తున్నాయా అని ప్రశ్నించారు. మా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నామన్న సీఎం.. అప్పులు తీసుకోవడం బడ్జెట్‌లో భాగమన్నారు. అభివృద్ధి చెందుతున్న అమెరికా, జపాన్ దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయన్నారు. దేశ జీడీపీ రూ.167 లక్షల కోట్లు ఉందన్నారు. అందులో 49.5 శాతం  వరకు కేంద్ర ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు.

ప్రస్తుతం మన దేశం అప్పు రూ.82 లక్షల కోట్లుగా ఉందని.. ఈ ఏడాది కేంద్రం రూ.8 లక్షల 76వేల కోట్ల అప్పు చెల్లించింది అన్నారు సీఎం కేసీఆర్. అప్పులు తీసుకోవడం తప్పుడు ఆలోచన కాదన్నారు. తెలంగాణ GSDPలో 21 శాతం అప్పులు ఉన్నాయని తెలిపారు. కేంద్రంతో పోల్చితే అది సగమే అన్నారు. ఉదయం పథకం కింద రూ. 9 కోట్ల అప్పు రాష్ట్రానికి వచ్చిందన్నారు.

ఈ నాలుగేళ్లలో TRS ప్రభుత్వం ఏ ఒక్క మంచి పని చేయలేదా అని ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి, ఆసరా పెన్షన్లు, గురుకుల పాఠశాలల ఏర్పాటు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలు కనిపించడం లేదా అని అన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ పథకాన్ని ఆదర్శంగా తీసుకుని అమలు చేస్తుందన్నారు. TRS ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడటం బాధాకరమన్నారు సీఎం కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy