వాయిస్ తో ఆధార్ గుర్తింపు

aadhaar-logoఆధార్ అంటే వేలిముద్ర గుర్తుకొస్తుంది ఎవరికైనా… త్వరలో ఇది కాస్తా మారనుంది. ఇకపై ఆధార్‌ వినియోగదారులకు స్వరమే గుర్తింపు కానుంది. భద్రతపరంగా మరింత మెరుగ్గా దీన్ని రూపొందిస్తున్నారు. వాయిస్ ఆధారంగా పని చేసే ఈ విధానాన్ని అమలుచేసేందుకు ప్రయత్నిస్తోంది UAID. రోజురోజుకు ఆధార్ పై అనుమానాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  ఇప్పటికే ఈ విధానంలో ప్రాచుర్యం పొందిన నువాన్స్‌ కమ్యూనికేషన్స్‌ సంస్థతో ప్రాథమిక చర్చలు ప్రారంభించినట్లు యూఐడీఏఐ అధికారి ఒకరు తెలిపారు. బర్లింగ్టన్‌ (అమెరికా) ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ స్వర, చిత్ర గుర్తింపు పరిజ్ఞానాన్ని అందజేస్తుంది. వేలిముద్రలు, ఐరిస్‌ల కంటే వాయిస్ ఆధారిత గుర్తింపు విధానం మరింత మెరుగైనదే కాకుండా నమ్మదగినదని యూడీఏఐ భావిస్తోంది.

బహుళ ప్రయోజనాల దృష్ట్యా ఇది మరింత నమ్మదగిన సాంకేతిక విధానంగా భావిస్తున్నారు. ఆధార్‌కు సంబంధించి ప్రతి వ్యక్తి స్వర నమూనాను సేకరిస్తారు. 180 నిర్దుష్టమైన గుర్తింపు ప్రక్రియల సహకారంతో పరిశీలిస్తారు. హావభావాలతో పాటు.. స్వర వేగం, పలికే విధానం, గొంతు, ముక్కులోంచి వచ్చే శబ్దాలు.. వీటన్నింటినీ విశ్లేషించి స్వరాన్ని నమోదు చేస్తారు. గుర్తింపు నిర్ధారణకు ఎలాంటి ప్రత్యేక పరికరాల అవసరం ఉండదు. వినియోగదారుల వద్ద ఏదైనా ఫోన్‌ ఉంటే సరిపోతోంది.  యాపిల్‌ కంప్యూటర్స్‌తో పాటు, ఐసీఐసీఐ సహా 3 భారతీయ బ్యాంకులకు స్వర ఆధారిత పరిజ్ఞానానికి సహకారం అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ‘మైగవ్‌’ పోర్టల్‌లో ప్రధాని ‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగాలను 14 భారతీయ భాషల్లోకి అనువదించేందుకు ఇటీవల సహకారం అందించింది. వీటితో పాటు మరో 13 భారతీయ భాషలను అందించేందుకు కూడా కృషి చేస్తోంది. గత 11 ఏళ్లుగా భారత్ లో సేవలు అందిస్తోంది నువాన్స్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy