వారణాసిలో ప్రధాని మోడీ

635782010433234089వారణాసిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఆయన తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు. వారణాసిలో రింగ్‌రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.  ఒకే విధమైన విద్యుత్ అభివృద్ధి పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుంచి కాశీ వరకు రోడ్ల వెడల్పు  పనులు చేపడతామని ప్రకటించారు ప్రధాని మోడీ.

 

pppmodగంగానది ప్రక్షాళన బాధ్యత కాశీ ప్రజలదే

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్, గంగా ప్రక్షాళనకు సహకరించాలని కోరారు. దేశంలో స్వచ్ఛభారత్ అభియాన్ ద్వారా పరిశుభ్రతపై అవగాహన పెరిగిందన్నారు. అదే సమయంలో స్వచ్ఛ భారత్ నిర్మాణం కావాలంటే ఎవరికి వారు వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించాలని సూచించారు. గంగానది కాలుష్యమయం కాకుండా కాపాడాలని సూచించారు. ప్రభుత్వంపై నమ్మకంతో అమృతానందమయి మాత గంగానది ప్రక్షాళన కోసం వంద కోట్ల రూపాయలిచ్చారని ఆ డబ్బును సద్వినియోగం చేయాల్సిన బాధ్యత కాశీ ప్రజలదేనన్నారు.  ఎవరికి వారు బాధ్యతాయుతంగా ఉండటమే పర్సనల్ సెక్టార్ అని చెప్పారు. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి పర్సనల్ సెక్టార్ బాధ్యతాయుతంగా ఉంటే అభివృద్ధి దానంతటదే జరుగుతుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ కోర్టు ఆదేశాల నేపథ్యంలో శిక్షా మిత్ర ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రధాని మాట్లాడుతూ ఆత్మహత్యలు పరిష్కారం కాదని, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. కోర్టు తీర్పు ప్రతి వచ్చాక ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy