
మరోవైపు ఈ నెలలో 23 నుంచి 26 వరకే మంచి ముహుర్తాలు ఉన్నాయి. దీంతో ఈ నాలుగు రోజుల్లోనే నగరంలో 50 వేల వివాహాలు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే 26న గచ్చిబౌలి స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్ మ్యూజిక్ లైవ్ షోతో ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తప్పవు. ఈ నెల 28న ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంక.. గ్లోబల్ ఎంటర్ ప్రెన్యువర్ సమ్మిట్ కు హాజరుకానున్నారు. దీంతో వారు ప్రయాణించే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీస్ అధికారులు చెబుతున్నారు.
జీఈఎస్ నేపథ్యంలో రెండు వారాలపాటు సినిమా థియేటర్లు, హోటళ్లు, వ్యాపార సంస్థలపైనా ఆంక్షలు విధిస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ ప్రకటించారు. ఇక, కొన్ని రోజులుగా ఐటీ కారిడార్, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న సుందరీకరణ పనులతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ట్రాఫిక్ మళ్లింపు, ఆంక్షలకు సంబంధించి 24, 25 తేదీల్లో అధికారిక ప్రకటన విడుదల చేస్తామని పోలీసులు చెబుతున్నారు.