వారసత్వ ఉద్యోగం కోసం తమ్ముణ్నే చంపేసింది

kmm-murderసింగరేణిలో వారసత్వ ఉద్యోగం కోసం సొంత తమ్ముడినే చంపేసింది ఓ అక్క. ఈ దారుణం ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 18 నెలల క్రితం ధర్మారం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్‌కేసు ఛేదించగా.. ఈ దారుణం బయటపడింది. ఖమ్మం జిల్లా చండ్రుపాడు మండలం రవికంపాడు గ్రామానికి చెందిన కావేటి రాములు సింగరేణి కార్మికుడిగా ఆదిలాబాద్‌ జిల్లా శ్రీరాంపూర్‌ స్ధిరపడ్డాడు. రాములుకు ఇద్దరు కుమారులు నాగేశ్వర్‌రావు, వెంకటేశం, కూతురు నాగమణి ఉన్నారు.  పెద్ద కుమారుడు సొంత గ్రామంలో ఉండగా, వెంకటేశం ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ భార్య ప్రియాంకతో కలిసి పెద్దపల్లిలో నివాసం ఏర్పరుచుకున్నాడు.

రాములు తన ఉద్యోగ విరమణ అనంతరం పెద్దకొడుకుకు వ్యవసాయ భూమి, చిన్న కొడుకుకు సింగరేణి ఉద్యోగం ఇస్తానని తీర్మానం చేశాడు. అప్పటికే భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది నాగమణి. ఆమెకు మల్లేశం అనే వ్యక్తితో వివాహేతర సంబంధ ఉంది. మల్లేశంను వివాహమాడి, వెంకటేశంను హతమారిస్తే ఉద్యోగం అతడికే వస్తుందని ఆలోచన చేసింది. దీంతో ప్రీప్లాన్డ్ గా వెంకటేశంను గతేడాది జనవరి 15న ఇంటికి పిలిచి గొంతు నులిమి చంపేసింది. అదే రాత్రి శవాన్ని మండలంలోని పత్తి పాకకు చెందిన చిక్కాల రాయమల్లు  కారులో చామనపల్లి వాగులోకి తరలించారు. అక్కడే గోయ్యి తీసి పూడ్చి పెట్టారు.

వెంకటేశం భార్య ప్రియాంక ధర్మారం పోలీస్ స్టేషన్ లో చేసిన ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది. ఇటీవల ధర్మారం ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన బాబురావు మిస్సింగ్‌ కేసుపై దృష్టి సాచించారు. అన్ని కోణాల్లో విచారించి వెంకటేశం హత్యకు గురైనట్లు నిర్ధారణకు వచ్చారు. పూర్వాపరాలు పరిశీలించి నిందితులను పట్టుకుని విచారిస్తే నిజాలు వెల్లడించారు. నాగమణి, వేల్పుల మల్లేశంలతో పాటు హత్యకు సహకరించిన కారు డ్రైవర్‌ చిక్కాల రాయమల్లు,అరెస్టు చేసి, హత్యకు పరోక్షంగా సహకరించిన వెంకటేశం సోదరుడు నాగేశ్వర్‌రావులపై కేసు నమోదు చేసినట్లు డీసీపీ విజేందర్‌రెడ్డి తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy