వారికి కన్నీటి స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు

kerala-men-from-abhaసౌదీ అరేబియాలో చిక్కుకున్న ముగ్గురు భారతీయులను సురక్షితంగా స్వదేశానికి  రప్పించారు అధికారులు. సౌదీలో యజమాని వేధింపుల నుంచి వారిని రక్షించారు. యెమెన్ లో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని … కేరళ నుంచి వారిని సౌదీ అరేబియా తీసుకెళ్లారు. అక్కడ ఇటుక బట్టీల్లో పనిచేయాలని వేధించారు. ఓ ఇటుక బట్టీ యజమాని… ఒకరిని కర్రతో కొడుతున్న వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ప్రత్యక్షం కావడంతో అధికారులు స్పందించారు. కేరళ సీఎం చొరవతో విదేశాంగ శాఖ అధికారులు … సౌదీ అరేబియా అధికారులతో మాట్లాడి వారిని విడిపించారు. సౌదీ నుంచి త్రివేండ్రం చేరుకున్న ముగ్గురికి … వారి కుటుంబ సభ్యులు కన్నీటితో స్వాగతం పలికారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy