వారికి శుభవార్త : పాన్ కార్డులో కొత్త ఆప్షన్

panపాన్‌ కార్డులో థర్డ్‌జెండర్‌ ఆప్షన్‌ కల్పిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సిబిడిటి). ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పాన్‌కార్డు దరఖాస్తులో ట్రాన్స్‌జెండర్లను ప్రత్యేక కేటగిరీగా గుర్తించిన కేంద్రం వారికోసం ఈ  ప్రత్యేక ఆప్షన్‌ను కేటాయించింది. స్త్రీ, పురుషుల మాదిరిగా ట్రాన్స్‌జెండర్లకు ఓ ఆప్షన్‌ను కేటాయిస్తూ ఆదాయ పన్ను శాఖ నిబంధనలను సవరించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను సీబీడీటీ సోమవారం విడుదల చేసింది. పాన్ కోసం దరఖాస్తు చేసే ట్రాన్స్‌జెండర్ల కోసం దరఖాస్తు ఫారంలో ప్రత్యేకంగా ఓ టిక్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు.

ఇన్ని రోజుల ఆధార్‌-పాన్‌ అనుసంధానంలో హిజ్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి కారణం ఆధార్‌ కార్డులో జెండర్‌ ఎంపికలో ఆడ, మగతోపాటు హిజ్రాలకు ప్రత్యేకంగా థర్డజెండర్‌ ఆప్షన్‌ ఉన్నప్పటికీ పాన్‌ కార్డు దరఖాస్తులో ఆ వెసులుబాటు లేదు. ఆధార్‌కార్డుల్లో థర్డ్‌ జెండర్‌ అనీ, పాన్‌కార్డుల్లో మాత్రం పురుషుడు/మహిళ అని ఉండటంతో హిజ్రాలు తమ ఆధార్‌ నంబర్లను పాన్‌కు అనుసంధానించుకోలేక ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో హిజ్రాలకు పాన్‌ కార్డుల ధరఖాస్తుకు, ఆధార్‌తో అనుసంధానికి సంబంధించిన సమస్యలు తొలగిపోయాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy