వారితో పోల్చినందుకు గర్వంగా ఉంది

PAWANచేనేతలను గౌరవించడం అంటే దేశ సంస్కృతిని గౌరవించినట్లేనన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. గుంటూరు జిల్లా చినకాకానిలో నిర్వహించిన చేనేత సత్యాగ్రహ దీక్షకు హాజరైన పవన్‌ దీక్ష చేపట్టిన కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.  తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

2019 ఎన్నికల్లో పోటీ చేస్తా…

చేనేత కార్మికుడు అంటే ఒప్పుకోనని… చేనేత కళాకారుడు అంటానన్నారు. వాళ్ల కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసన్నారు. ఇంతకుముందు చెప్పినట్లు 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తానని, శాసనసభలో చేనేత కళాకారుల వాణిని వినిపిస్తానని ప్రకటించారు. తాను కావాలంటే పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండగలను కానీ, అలా చేయడం వల్ల చేనేత కళాకారుల కష్టాలు తీరవన్నారు. కోట్ల సంపాదనపై తనకు ఆశ లేదని అన్నారు.

చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానంటే హేళన చేశారని…తనను ఎంగిలాకులు ఎత్తుకునే వాడిగా అవహేళన చేశారని చెప్పిన పవన్ తనను వారితో పోల్చినందుకు గర్వంగా ఉందన్నారు. శుభ్రం చేసే వారు లేకపోతే ఈ సమాజం ఏ పరిస్థితిలో ఉంటుందో ఒక సారి ఊహించుకోవాలన్నారు.

సామాజిక న్యాయం కోసమే రాజకీయాల్లోకి

పదవుల కోసం తాను రాజకీయాలలోకి రాలేదని.. సామాజిక న్యాయం కోసమే రాజకీయాలలోకి వచ్చానన్నారు. ప్రభుత్వాలు ఎవరికైతే అండగా నిలబడవో…వారి పక్షాన తాను న్యాయం కోసం పోరాడతానని పవన్ తెలిపారు. ప్రజాసేవకు అధికారం అవసరం లేదని పేర్కొన్నారు.

చేనేత కళాకారులకు నగదు ప్రోత్సాహకాలు

లక్షలాది మంది ప్రజల పొట్ట కొడుతున్న వ్యాపారులను కట్టడి చేయాలన్నారు. 11 రకాల ఉత్పత్తులు కేవలం చేతిమగ్గాల మీదే నేయాలన్నారు. పవర్‌లూమ్స్‌ పేరుతో కార్మికుల పొట్ట కొడుతున్న వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.  క్రికెట్‌, టెన్నిక్‌ క్రీడాకారులకు ఇచ్చినట్లే.. చేనేత కళాకారులకు నగదు ప్రోత్సహకాలివ్వాలన్నారు. చేనేత కళాకారుల వ్యక్తిగత నైపుణ్యాన్ని ప్రోత్సహించేలా నగదు బహుమతులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వాల హామీల అమలుపై చేనేత సంఘాలు పర్యవేక్షణ కమిటీ వేసుకోవాలన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy