వారేవా కాంబినేషన్ : బాహుబలితో ప్రభుదేవా మూవీ

prabhas-prabhudevaప్రభాస్ తో మరోసారి కలిసి పనిచేయడానికి రెడీ అవుతున్నాడు ప్రభుదేవా. బాహుబలితో దేశవ్యాప్తంగా ఫేమ్ సంపాదించుకున్న ప్రభాస్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఇప్పటికే దీనిపై హోంవర్క్ కూడా చేసినట్టు టాలీవుడ్ టాక్. ఇదివరకు ప్రభాస్‌, ప్రభుదేవాల కలయికలో ‘పౌర్ణమి’ వచ్చింది. ఇప్పుడాయన ప్రభాస్‌తో ఓ సినిమా చేయాలని భావిస్తున్నారట. ఇందుకోసం ఓ అగ్ర నిర్మాత రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ప్రభుదేవాకు బాలీవుడ్‌లో గుర్తింపు ఉంది. ‘బాహుబలి’తో ప్రభాస్‌ కూడా అక్కడి హీరో అయిపోయాడు. అందుకే ఈ కాంబినేషన్‌ ఓకే అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ‘‘బాహుబలి’ చూశాక వచ్చిన ఆలోచన కాదు ఇది. ప్రభాస్‌తో నాకు ఎప్పటినుంచో అనుబంధం ఉంది. ప్రస్తుతం ప్రభాస్‌ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నా. ‘సాహో’ పూర్తయ్యాక మా సినిమా గురించి వివరాలు చెప్తా’’ అన్నారు ప్రభుదేవా.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy