వారేవా : భూమిపైకి వస్తూనే వండర్ చేశాడు

kidకొన్ని ఫొటోలు సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు. ప్రపంచమంతా తిరుగుతాయి. అలాంటిదే ఈ ఫొటో. ఎంతో అందంగా.. చూడముచ్చటగా ఉన్నాడు కదూ ఈ బుడ్డోడు. వీడు చేసిన పని ఇప్పుడు ఔరా అనిపిస్తోంది. భూమి మీదుకు వస్తూనే.. వస్తువును పట్టుకొచ్చాడు. డెలివరీ టైంలో డాక్టర్లు కూడా నోరెళ్లబెట్టారు. ఆశ్చర్యపోయారు. ఇంతకీ విషయానికి వస్తే.. ఈ బుల్లిబుజ్జాయి చేతిలో ఓ వస్తువు ఉంది కదా.. ఇదే వాల్డ్ వైడ్ ఫేమస్ చేసింది. ఇది గర్భ నిరోధక వస్తువు.  గర్భం రాకుండా ట్రీట్ మెంట్ తీసుకున్న తర్వాత.. అది విఫలం అయ్యింది. ఆమె గర్భం దాల్చింది. ఈ కిట్ మాత్రం అలాగే తల్లి గర్భసంచిలో ఉండిపోయింది. డెలివరీ టైంలో.. ఈ బుల్లోడు ఆ వస్తువును చేతిలో పట్టుకుని బయటకు వచ్చాడు. వస్తూ వస్తూనే మమ్మీకి గిఫ్ట్ తెచ్చినట్లు.. గట్టిగా పట్టుకుని ఉన్నాడు.

ఇలా జరగటం చాలా చాలా అరుదు అంటున్నారు వైద్యులు. తల్లి గర్భం నుంచి వస్తూనే వండర్ చేశాడని.. చేతిలో ఆ డివైజ్ పట్టుకుని ఉండటం విచిత్రంగా ఉంటుందంటున్నారు. అమెరికా టెక్సాస్ కు చెందిన లూసీ హెలీన్ ఈ పసోడి తల్లి. కాన్పు సమయంలో ఆమె పక్కనే ఉన్న తన  ఫ్రెండ్ దీన్ని గమనించి ఫొటో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. అలా ఇది వాల్డ్ వైడ్ వైరల్ అవుతోంది. ఎంతైనా వీడు ఘటికుడే..

3 Responses to వారేవా : భూమిపైకి వస్తూనే వండర్ చేశాడు

  1. balu says:

    WOW! It’s really wonder. Inthaki adi lopale enduku undipoyindi?

  2. Anonymous says:

    Great kid

  3. Anonymous says:

    Very strong kid

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy