వార్నింగ్ : నల్లాలకు రెడ్ నోటీసులు

v6పెండింగ్ బిల్స్ పై సీరియస్ గా దృష్టి పెట్టారు వాటర్ బోర్డు అధికారులు. నల్లా బిల్లులు చెల్లించని వారికి రెడ్ నోటీసులు ఇవ్వడమే కాదు.. కనెక్షన్లు సైతం కట్ చేస్తున్నారు. డొమెస్టిక్ పర్పస్ లో నల్లా కనెక్షన్ తీసుకుని.. కమర్షియల్ గా వినియోగిస్తే సహించేది లేదంటున్నారు. అనుమతులు లేని కనెక్షన్లు ఉంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు.

గ్రేటర్ లో 9లక్షల 12 వేల నల్లా కనెక్షన్లున్నాయి. గ్రౌండ్ లెవల్ అధికారుల నిర్లక్ష్యంతో.. వాటర్ బోర్డుకు వచ్చే ఆదాయం తగ్గుతోందన్న ఆరోపణలున్నాయి. దీంతో కనెక్షన్లపై దృష్టి పెట్టారు అధికారులు. ఇప్ప టికే 26 శాతం కనెక్షన్లకు మీటర్లను ఏర్పాటు చేశారు. ఇక డోమేస్టిక్ పద్ధతిలో తీసుకుని.. కమర్షియల్ గా వినియోగిస్తే చర్యలు తప్పవంటున్నారు. ఇప్పటికే కొన్ని కనెక్షన్లు గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు.

ఆరు నెలలుగా వాటర్ బిల్స్ చెల్లించని కమర్షియల్ కనెక్షన్లపై చర్యలు తీసుకోవాలని అధికారులు డిసైడయ్యారు. బిల్లుల చెల్లింపులో మొండికేస్తున్న 7వేల 294 మందికి రెడ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. రెడ్ నోటీసులు ఇచ్చినా స్పందించని కనెక్షన్లు తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు 484 కనెక్షన్లు కట్ చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ లో నీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, రుణాల చెల్లింపు ఇతర ఖర్చులకు ప్రతి నెలా 110 కోట్లకు చేరుతుంది. వాటర్ బోర్డుకు నీటి బిల్లుల ద్వారా వచ్చే ఆదాయం 90 నుంచి 95 కోట్ల మాత్రమే. దీంతో ప్రతి నెలా 15 నుంచి 20 కోట్లు వరకు సంస్థకు ఆర్థిక భారం పడుతోంది. దీనిని అధిగమించేందుకు బకాయిల వసూలుపై అధికారులు దృష్టిపెట్టారు. నష్టాన్ని తగ్గించుకునే పనిలో పడిన జలమండలి.. మొండి బకాయిలు సహించేది లేదంటోంది. అక్రమ కనెక్షన్లు ఉంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy