వార్నింగ్ : రోడ్లపై గుంత కనిపిస్తే సస్పెండ్ చేస్తా

kcr-roadsరాష్ట్రంలోని రహదారులపై ఒక్క గుంత కూడా కనిపించవద్దని, మే నెలాఖరులోగా అన్ని గుంతలు పూడ్చేయాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. జూన్ 1 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానని, ఎక్కడ గుంత కనిపించినా సరే సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో రోడ్లు భవనాల శాఖ పరిధిలోని పనులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్ అండ్ బి శాఖకు కొత్త రహదారుల నిర్మాణానికి, రహదారుల మరమ్మత్తులకు అవసరమైన నిధులు బడ్జెట్లోనే కేటాయించామని.. ఇంకా గుంతల రోడ్లు కనిపించడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇకపై అధికారుల అలసత్వాన్ని ఏమాత్రం క్షమించేది లేదని స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో పర్యటించినప్పుడు వరంగల్ నుంచి పాలకుర్తి వరకు అనేక గుంతలు కనిపించాయని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. గుంతలు ఉండవద్దని ఎప్పటికప్పుడు వాటిని పూడ్చేయాలని గతంలోనే.. తాను చెప్పాను అన్నారు. అయినా అధికారులు సీరియస్ గా తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులు టైమిస్తున్నానని.. మే చివరి నాటికి అన్ని గుంతలు పూడ్చేయాలని అన్నారు. ఆ తర్వాత ఎక్కడైనా గుంతలు కనిపిస్తే అక్కడికక్కడే అక్కడి అధికారిని సస్పెండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు సీఎం కేసీఆర్.

‘‘కొత్తగా జిల్లా కార్యాలయాల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించాం. డిజైన్లు కూడా ఆమోదించాం. వెంటనే టెండర్లు పిలవాలి. 10, 15 రోజుల్లోనే నిర్మాణ పనులు ప్రారంభించి, ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కార్యాలయాల నిర్మాణం కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజలకు పాలన అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో జిల్లాలను ఏర్పాటు చేశాం.. కార్యాలయాల నిర్మాణం జరిగితేనే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగవద్దు’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

స‌మావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, సునిల్ శర్మ, రామకృష్ణ, ఈఎన్‌సీలు గణపతిరెడ్డి, రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy