వార్మప్ మ్యాచ్ లో మనోడి డబుల్ సెంచరీ

Shreyas-Iyerఆస్ట్రేలియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ లో తడాఖా చూపించారు భారత్ ‘ఎ’ జట్టు ఆటగాళ్లు. యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీతో ఇరగదీశాడు. 210 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లతో 202 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 85 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రేయస్ అయ్యర్.. ఆద్యంత ఆకట్టుకుని డబుల్ సెంచరీతో మెరిశాడు. 176/4 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ‘ఎ’ జట్టు అయ్యర్ డబుల్ సెంచరీతో 91.5 ఓవర్లలో403 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో మూడో రోజు ముగిసే సమయానికి 110/4 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 469/7 డిక్లేర్ చేసంది. దీంతో వార్మప్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy