వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇలా ఇచ్చిన సమంత

naga-chaitanya-samanthaటాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ నాగ చైతన్య, సమంత జంట వేలంటైన్స్ డే ని వెరైటీ గా జరుపుకున్నారు. గతనెల 29న నిశ్చితార్ధం జరుపుకున్న ఈ జంట  త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. అయితే ప్రతి అకేషన్ ని గ్రాండ్ గా జరుపుకునే ఈ జంట వేలంటైన్స్ డే ని కూడా వెరైటీ గా జరుపుకున్నారట. ఈ వేలంటైన్ డే సందర్భంగా సమంత చైతూకి నుదుటిపై ముద్దు ఇచ్చి తన ప్రేమను చాటుకుంది. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వీరిద్దరి అభిమానులు ఈ జంటకు ఆల్ ది బెస్టూ చెబుతూ జీవితాంతం ఇలానే సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే సమంత తమిళ సినిమాలతో బిజీగా ఉంటూనే తెలుగులో రామ్ చరణ్- సుకుమార్ ప్రాజెక్ట్ తో పాటు రాజు గారి గది సీక్వెల్ లో నటించనుంది. ఇక చైతూ సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. కృష్ణ ఆర్.వి మరిముత్తు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ మూవీ మొదలు కానుంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy