వాల్డ్ టాప్ 50 బ్యాంకుల్లో SBI

World's-top50-bank-sbiప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల జాబితాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నిలవనుంది. ఐదు జాతీయ బ్యాంకులను  SBI లో కలపడానికి కెబినెట్ ఆమోదముద్ర వేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. వరల్డ్ టాప్ 50 బ్యాంకులలో ఒకటిగా నిలవనుంది SBI.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (SBH), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపుర్‌ (SBBJ), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ (SBM), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌ (SBT), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా (SBP)లు ఎస్‌బీఐలో విలీనం కానున్నాయని.. అందుకు పాలకమండళ్లతో పాటు కేంద్రమంత్రివర్గం ఆమోదం లభించిందని చెప్పారు. విలీనం తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా SBI అవతరిస్తుందని వివరించారాయన. విలీనం వల్ల తొలి ఏడాది రూ.1000 కోట్లు ఆదా అవుతాయని తెలియజేశారు బ్యాంకు అధికారులు.

SBIలో భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేసే ప్రతిపాదనపై కేంద్రమంత్రి వర్గం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు జైట్లీ. స్టేట్ బ్యాంకు చెందిన 5 అనుబంధ బ్యాంకుల విలీనం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో త్వరలో నే ప్రకటిస్తామన్నారు. ఈ వలీనం వల్ల ఏ ఒక్క ఉద్యోగికి నష్టం కలుగదన్నారు. విలీనం సజావుగా జరుగుతుందనీ అభిప్రాయ పడ్డారు.  భారతీయ స్టేట్‌బ్యాంక్‌ చట్టం-1959ను, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ చట్టం-1956ను రద్దుకు కేంద్ర కెబినెట్ ఓకే చెప్పింది.

విలీనం అనంతరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాదాదారుల సంఖ్య 50 కోట్లకు చేరుతుంది.  ఎస్‌బీఐ ఆస్తుల విలువ రూ.37 లక్షల కోట్లకు చేరుతుంద.  SBI కింద 22,500 బ్యాంకు శాఖలు, 58 వేల ATMలు ఉంటాయి. ప్రస్తుతం SBI లోనే 16,500 బ్యాంచ్ లు ఉన్నాయి. 36 దేశాల్లో 191 ఫారన్ బ్యాంక్ బ్రాంచ్ లు ఉన్నాయి. ఇదివరకు 2008లో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ సౌరాష్ట్ర (SBS) మొదటి సారి SBIలో విలీనం కాగా.. 2010లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండోర్‌(SBI) విలీనమయ్యాయి.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy