వాళ్లకి కల్తీ కల్లే కావాలట

KATI-KALLU-300x336కల్తీ కల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.  ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యమే కల్తీకల్లుకు కారణమని అన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.  కల్లు బాధితులను ఆయన పరామర్శించారు.

బాధితులు విచిత్రంగా ప్రవర్తిస్తుండటంతో… కొందరిని కట్టేసి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు డాక్టర్లు.  నిర్మల్ టౌన్ లో బెస్తవారి పేటకు చెందిన నర్సింహులు అనే వృద్ధుడు కల్తీ కల్లుకు బానిసై మతిస్థిమితం కోల్పోయి బావిలో పడి చనిపోయాడు.  గత కొన్ని రోజులుగా క్లోరోఫామ్ తక్కువగా ఉండటంతో రాత్రిళ్ళు విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్లు బాధితులను దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు.  వాళ్ళకి అందుతున్న ట్రీట్ మెంట్ గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వల్లే కల్తీ కల్లు బాధితులు పెరుగుతున్నారన్నారు మంత్రి… ఇప్పటికైనా కల్తీ కల్లు తయారీ నిలిపివేయాలని… లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజక వర్గంలో చాలా గ్రామాల్లో మత్తుకు బానిసలైన వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. మూర్చ, కడుపులో మంట, నిద్రలేమితో లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ … పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ప్రాణాలు వదులుతున్నారు. ఒక్క జడ్చర్ల లోనే ఇప్పటి వరకూ 11 మంది చనిపోయారు. వీళ్ళల్లో కొందరు మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకోగా… మరికొందరు చికిత్స చేసుకొని ఇంటికెళ్ళాక చనిపోయారు.

బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది బాధితులకు ట్రీట్ మెంట్ జరుగుతోంది. రోజు రోజుకు  పెరుగుతున్న మరణాలపై ప్రజా సంఘాలు ఉద్యమిస్తున్నాయి. ఈ మరణాలకు కల్లు వ్యాపారులను బాధ్యులుగా చేసి… వారి మర్డర్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల్లో బాధితులకు సరైన ట్రీట్ మెంట్ ఇచ్చేందుకు … ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేసినట్టు వైద్యశాఖ అధికారులు చెబుతున్నా… మృతుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy