వాళ్లని చంపేస్తాను: రకుల్ ప్రీత్ సింగ్

Rakul Preet Singhమలయాళీ నటిపై జరిగిన దాడి గురించి తన మనసులోని మాట బయటపెట్టారు ప్రముఖనటి రకుల్ ప్రీతిసింగ్. ఆ వార్త తెలియగానే తాను హడలిపోయానని.. నిజంగా ఇది చాలా సిగ్గుమాలిన చర్యని ఆవేదన వ్యక్తం చేశారు. తాను గనుక ఆ స్థానంలో ఉంటే… నిజంగా వాళ్లని చంపేసేదాన్నని.. ఆమధ్య ఓ ఆకతాయి తన అనుమతి లేకుండా ఫొటో తీస్తుంటే అతన్ని కొట్టానని తెలిపారు. ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలిపారు రకుల్. త్వరలో కోలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న ఈ భామ… మహిళా హక్కులపై మహిళలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిస్తున్నారు. మహిళా దినోత్సవం, మాతృ దినోత్సవం అంటూ ఉత్సవాలు జరుపుకోవడంలో ఇక అర్థం లేదనిపిస్తోందని.. మహిళలకు గౌరవం మాట అటుంచితే, వాళ్లని మనుషులుగానే చూడడం లేదని ఆవేదనవ్యక్తం చేశారు రకుల్.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy