
వెస్ట్ చమప్రన్ జిల్లాలోని బెట్యాలోని రామ్ లఖన్ సింగ్ యాదవ్ కాలేజీలో బీఏ చదువుతున్నాడు. అడ్మిట్ కార్డు నెంబర్ 104762. ఇంగ్లీష్ హానర్స్, జియోగ్రఫీ, హిస్టరీ సబ్జెట్‌ల్లో పరీక్ష రాశాడు తాబ్రెజ్. అయితే వచ్చిన రిజల్ట్ చూసి షాక్ అయ్యాడు.
భీమ్ రావ్ అంబేద్కర్ బీహార్ యూనివర్సిటీ(BRABU) నిర్వహించిన మహమ్మద్ తాబ్రెజ్ బీఏ పార్ట్-1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. అయితే రిజల్ట్స్ మాత్రం తప్పుల తడకగా వచ్చాయి. తాబ్రెజ్ రాసిన ఇంగ్లీష్ హానర్స్‌లో కాకుండా సైకాలజీలో అతను పాసైనట్టు ఫలితాలు విడుదలయ్యాయి. తాబ్రెజ్ కనీసం రిలేటెడ్ సబ్జెట్లుగా కూడా సైకాలజీని ఎంచుకోలేదు. జియోగ్రఫీ, హిస్టరీలు మాత్రమే ఆయన అనుబంధ సబ్జెట్లు. మార్కు షీటులో వచ్చిన ఫలితాలను చూసుకున్న తాబ్రెజ్ వెంటనే.. ఎగ్జామినేషన్ వింగ్‌ను ఆశ్రయించాడు. అయితే అది యూనివర్సిటీ పొరపాటు కాదని… ముజఫర్‌పూర్‌లో ఉన్న BRABU ప్రధాన కార్యాలయానికి వెళ్లాలని.. కాలేజీ అధికారులు సూచించారు.
BRABU ఉద్యోగులు కూడా తాము చేసిన తప్పును ఒప్పుకోక పోగా… ఎగ్జామినేషన్ దరఖాస్తులోనే ఈ తప్పు జరిగి ఉంటుందంటూ వాదిస్తున్నారని చెప్పాడు తాబ్రెజ్. కొంత కాలంగా బీఆర్ఏబీయూ చేస్తున్న పొరపాట్లకు బలవుతున్న విద్యార్థుల్లో తాబ్రెజ్ ఒక్కడే కాదని… ఇలా ఎంతో మంది మార్కులిస్టుల్లో ఇలాంటి తప్పులు వచ్చినట్లు బయటపడింది.
రామ్ లఖన్ సింగ్ యాదవ్ కాలేజీలో ప్రిన్సిపల్ ఇంతియాజ్ మాత్రం..విద్యార్థికి న్యాయం చేస్తామన్నారు. యూనివర్శిటీ అధికారులతో మాట్లాడి కరెక్టు రిజల్ట్ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.