గడియారం తయారుచేస్తే టైమ్ బాంబ్ అనుకున్నారు

635779482362165911-0915-ahmed-mohamed07ఆ అబ్బాయి తను సొంతంగా తయారు చేసిన గడియారాన్ని స్కూల్లో టీచర్లకు చూపించాడు. వాహ్.. శభాష్.. గుడ్.. కీప్ ఇట్ అప్ … ఇలా ఎన్నో ప్రశంసలు తన టీచర్ల నుంచి వస్తాయని ఎంతో ఆశించాడు ఆ పిల్లాడు. కానీ ఇవేమీ దక్కలేదు. వీటి స్థానంలో ఆ ఫ్యూచర్ సైంటిస్టు చేతులకు బేడీలు పడ్డాయి. ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా.. అమెరికాలోని టెక్సాస్ లో. ఆ అబ్బాయి పేరు అహ్మద్ మహ్మద్. నైన్త్ క్లాస్ చదువుతున్నాడు. తన ఇంజినీరింగ్ ప్రాజెక్టులో భాగంగా ఓ వాచ్ ను తయారు చేశాడు. ఎంతో ఉత్సాహంతో దాన్ని తన టీచర్లకు చూపిద్దామని తీసుకెళ్లాడు. కానీ అసలే ఇస్లామోఫోబియాతో ఉన్న అమెరికన్లు… ఆవిష్కరణను టైమ్ బాంబుగా భావించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్లు వచ్చి జైలుకు తీసుకెళ్లారు. చివరికిది అమెరికన్ ప్రెసిడెంట్ ఒబామాకు చేరింది. ఆయన పూర్తి విషయం తెలుసుకొని అహ్మద్ ను వైట్ హౌజ్ కు ఇన్వైట్ చేశాడు. ఆ పిల్లాడు చేసిన ఆవిష్కరణను ఎంతో మెచ్చుకున్నాడు.  పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీసి.. ప్రోత్సహించాలే కానీ ఇలా చేయకూడదని స్కూల్ పెద్దలకు చివాట్లు పెట్టాడు. అహ్మద్ పట్ల స్కూల్ వాళ్లు వ్యవహరించిన తీరుకు బాధపడుతున్నా అన్నాడు.  ఇలాంటి వాళ్లే దేశానికి ఎంతో అవసరమని చెప్పి… అహ్మద్ ను ఇంటికి పంపించాడు ఒబామా. ఇప్పుడీ అబ్బాయి… అమెరికాలో హాట్ టాపిక్ అయ్యాడు.

_85589317_4163c0e1-3c48-44ab-af0f-c53360632e81NM_16Ahmed10

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy