వాళ్లు వేశ్యల కంటే హీనం … లంచమడిగితే చెప్పుతో కొట్టండి

surendra singh ప్రభుత్వ అధికారులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్. ప్రభుత్వ అధికారుల కంటే వేశ్యలే నయమన్నారు. ‘‘ప్రభుత్వాధికారుల కంటే వేశ్యలు ఉత్తమమైన వారని, వారు కనీసం డబ్బు సంపాదించేందుకు వేదికపై నృత్యం చేస్తారని, కానీ ఈ ప్రభుత్వ అధికారులు ప్రజల నుంచి డబ్బు తీసుకున్న తర్వాత కూడా పనిని చేయటం లేదు’’ అని ఆరోపించారు సురేంద్రసింగ్. అవినీతి ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా సురేంద్రసింగ్ చేతావని దివస్ పేరిట నినాదాలు చేశారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే చెప్పుతో కొట్టండి అంటూ పిలుపునిచ్చారు ఆయన. గతంలో బీజేపీ సర్కారు అవినీతిపై ఆరోపణలు చేసిన రాజ్ భర్ నుద్దేశించి గతంలో సురేంద్రసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘వేశ్యలకు సమాజం మొత్తం వేశ్యలలాగానే కనిపిస్తారు’’ అని గతంలో వ్యాఖ్యానించారు. గోరఖ్ పూర్ ఉప ఎన్నికల పర్వంలోనూ సురేంద్రసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2019 లోక్ సభ ఎన్నికలు ఇస్లాంకు భగవంతుడికి మధ్య పోరు లాంటిదని సురేంద్రసింగ్ అని పోల్చారు. దీంతోపాటు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని రావణుడి చెల్లెలు శూర్ఫణఖ అని వ్యాఖ్యానించాడు సురేంద్రసింగ్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy