వావ్ : పిల్ల‌ల‌కు కూడా మసాజ్ సెంట‌రా..!

spa-childరోజు రోజుకూ పెరిగిపోతున్న సాంకేతిక‌త‌తో పాటు జీవ‌న‌శైలి కూడా మారిపోతోంది. అల‌సిన శ‌రీరానికి కాస్తంత రిలీఫ్ కావాలంటే ఏ చెట్టుకిందో టెంటు వేసుకుని ఉండే వాడి ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఒక్క ప‌ట్టు ప‌ట్టించుకుంటే నొప్పుల‌న్నీ హాంఫ‌ట్  అని మాయ‌మ‌య్యేవి. ఆ త‌ర్వాత కాల‌క్ర‌మేణా మ‌సాజ్ సెంట‌ర్లంటూ కొత్త‌గా వెలిశాయి. అక్క‌డ కూడా ఇదే త‌ర‌హాలో ప‌ట్టుబ‌డ‌తారు కాక‌పోతే ఆ స‌లూన్ కొంత క్లాస్‌గా ఉంటుంది. ఆ త‌ర్వాత స్పాలు వ‌చ్చేశాయి. ఇప్పుడు పెద్ద న‌గ‌రాల్లో ప్ర‌తి వీధికి ఓ స్పా సెంట‌ర్లున్నాయి. అయితే ఈ మ‌సాజ్ సెంట‌ర్ల‌న్నీ పెద్ద‌వాళ్ల‌కే.

మేమేం త‌క్కువా మాక్కూడా స్పాలు కావాలంటున్నారు చిన్నారులు. అందుకే ఆస్ట్రేలియాలోని పెర్త్‌లోఇద్ద‌రు భార‌తీయ మ‌హిళ‌లు బుడ్డోళ్ల‌కు ఓ స్పాను ఓపెన్ చేశారు. ఇంకే అక్క‌డి స్థానికులు చిన్న‌పిల్ల‌ల‌ను ఎంచ‌క్కా ఆ స్పాకు తీసుకొస్తున్నారు. ఈ చిన్నారులు స్విమింగ్ చేస్తూ మసాజ్ చేయించుకుంటూ భ‌లే ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి ఆ ఐడియా వ‌చ్చిన మ‌హిళ‌ల‌కు హ్యాట్సాఫ్ అంటున్నారు చిన్నారుల త‌ల్లిందండ్రులు. స్విమ్మింగ్ నుంచి మ‌సాజ్, బేబీ కేర్‌, హేయిర్ స్టైలింగ్ వంటివ‌న్నీ ఆస్పాలో ఉన్నాయి. బుడి బుడి అడుగులు వేయాల్సిన వ‌య‌సుల్లో ఈత‌కొడుతూ చిన్నారులు దుమ్మురేపుతున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy