వాహనదారులు తెలుసుకోండి : అమీర్‌పేటలో ట్రాఫిక్‌ ఆంక్షలు

metro-ammerpetఅమీర్‌పేట మైత్రీవనంలో మెట్రో కారిడార్‌, ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్‌ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయడంలో భాగంగా గురువారం(ఆగస్టు 3) అర్ధరాత్రి నుంచి 45 రోజుల పాటు ట్రాఫిక్‌ ఆంక్షలను విధిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు నగర పోలీసు కమిషనర్‌ ఎం.మహేందర్‌రెడ్డి . ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్‌ల మీదుగా అమీర్‌పేట, సికింద్రాబాద్‌ వైపు వెళ్లే వాహనాలతో పాటు ఎస్.ఆర్.నగర్‌, మైత్రీవనం మీదుగా మధురానగర్‌, కల్యాణ్‌నగర్‌ వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నారు.

ఇలా ఉన్నాయి ట్రాఫిక్‌ ఆంక్షలు

.. ఎర్రగడ్డ, ఎస్సార్‌నగర్‌ల మీదుగా బేగంపేట, సికింద్రాబాద్‌లవైపు వెళ్లే వాహనాలు ఎస్సార్‌నగర్‌ ఉమేష్‌చంద్ర విగ్రహం నుంచి ఎడమవైపు తిరిగి ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌, టి-జంక్షన్‌ల నుంచి సత్యం థియేటర్‌, కనకదుర్గ గుడి నుంచి గ్రీన్‌ల్యాండ్స్‌, బేగంపేటల వైపు వెళతాయి.

.. ఎర్రగడ్డ, ఎస్సార్‌నగర్‌ల మీదుగా పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలు ఎస్సార్‌నగర్‌ ఉమేష్‌చంద్ర విగ్రహం నుంచి ఎడమ వైపు వెళ్లి ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌, టి-జంక్షన్‌, సత్యం థియేటర్‌ చౌరస్తా నుంచి కుడివైపునకు మళ్లి మైత్రీవనం చౌరస్తా మీదుగా అమీర్‌పేట ప్రధాన రహదారి గుండా పంజాగుట్ట వెపు వెళ్లాల్సి ఉంటుంది.

.. ఎస్సార్‌నగర్‌ ఉమేష్‌చంద్ర విగ్రహం నుంచి ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌, టి-జంక్షన్‌, సత్యం థియేటర్‌, కనకదుర్గ ఆలయం వరకు వన్‌వేలో మాత్రమే వాహనాలను అనుమతిస్తారు.

.. ఫతేనగర్‌ వైపు నుంచి ఎస్సార్‌నగర్‌ మీదుగా అమీర్‌పేట వైపు వచ్చే వాహనాలు ఆర్‌అండ్‌బీ కార్యాలయం నుంచి ఎడమవైపు ధరంకరం రోడ్డు, జీహెచ్‌ఎంసీ ప్లే గ్రౌండ్‌ మీదుగా వెళ్లాలి.

.. ఎర్రగడ్డ వైపు నుంచి మధురానగర్‌, కల్యాణ్‌నగర్‌ వైపు వెళ్లె ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు ఇతర లైట్‌ మోటార్‌ వాహనాలు ఎస్సార్‌నగర్‌ ఉమేష్‌చంద్ర విగ్రహం నుంచి కుడి వైపునకు తిరిగి కల్యాణ్‌నగర్‌ మీదుగా వెళ్లాలి.

.. ఎర్రగడ్డ వైపు నుంచి కల్యాణ్‌నగర్‌, మధురానగర్‌ల వైపు వెళ్లే భారీ వాహనాలు ఎస్సార్‌నగర్‌ ఉమేష్‌చంద్ర విగ్రహం మీదుగా ఎడమవైపు తిరిగి ఎస్సార్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌, టి-జంక్షన్‌, సత్యం థియేటర్‌, దుర్గ గుడి మీదుగా అమీర్‌పేట చౌరస్తా నుంచి వెళ్లాలి.

.. బేగంపేట నుంచి ఎస్సార్‌నగర్‌, యూసుఫ్‌గూడ వైపు వెళ్లే వాహనాలు గతంలోలాగా సత్యం థియేటర్‌ మీదుగా అనుమతించరు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy