వాహ్ ఉస్తాద్.. పాండవుల గుట్టపై ఏడు బావులు

Kmm6ప్రకృతి అందాలకు పుట్టిల్లు. పాలనురగల్లాంటి జలపాతాలు. నయాగారను గుర్తు చేసే వాటర్ పాల్స్.  ఒకదానికి మించి మరొకటి పోటీపడుతూ జలజలా జాలువారుతాయి అక్కడి సెలయేర్లు. పచ్చని చెట్లు… పక్షుల కిలకిలా రావాల మధ్య అడవి మధ్యలో దాగి ఉన్నాయి ఆ ప్రకృతి అందాలు.

ఈ అందాలన్ని కలబోసి ఒకే దగ్గర చూడాలంటే ఖమ్మం జిల్లా వాజేడుకు వెళ్లాల్సిందే. ఇక్కడి ఏజెన్సీలోని పాండువుల గుట్టలో ఏడు బావుల జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి రమణీయతకు మారుపేరు ఈ జలపాతాలు. ఇది బోగత జలపాతం. మన రాష్ట్రంలో ఇదే అతి పెద్ద వాటర్ ఫాల్. అడవి మధ్యలో ఉండే ఈ జలపాతాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు. కాస్త దూరం నుంచి చూస్తే… ఆకాశం నుంచే ఈ పాలధార కురుస్తాందా అనిపించేలా ఉంటుంది అద్భుత దృశ్యం. కమ్మని సంగీతం వినిపిస్తూ హొయిలొలికిస్తూ కిందకు దూకుతుంది సెలయేరు. చూసే కొద్ది చూడాలనిపించే ప్రకృతి అందాలు బోగత జలపాతం సొంతం.

Kmm4ఈ జలపాతం దగ్గరకు వెళ్లాలంటే.. ఎత్తైన పచ్చని చెట్లు, కొండల మధ్య ఉన్న అడవి నుంచి వెళ్లాలి.  అడవి మధ్యలో అందమైన నీటి సెలయేర్లు కనువిందు చేస్తాయి. గుట్టల మధ్య నుంచి … ఆకాశమంత ఎత్తు నుంచి ధారలుగా నీళ్లు జారిపడుతుంటాయి. ఇక టూరిస్టుల సందడి ఈ అందాలను మరింత పెంచుతాయి. ఈ జలపాతాలకు పెద్ద చరిత్ర కూడా ఉంది. పాండవులు వనవాస సమయంలో ఈ కొండల మధ్యనే నివాసమున్నారని చెబుతుంటారు స్థానికులు. అప్పుడు నిర్మించిన ఏడు బావులు ఇప్పటికీ కనువిందు చేస్తుంటాయంటున్నారు. ఒక బావి నుంచి మరో బావిలోకి ఈ జలపాతం పారుతుంటే… చూసేందుకు ఎంతో రమణీయంగా ఉంటుంది. అంతేకాదు ఇవి ఏడాది పొడవునా పారుతూనే ఉంటాయి. ఈ జలపాతాలకు ఎక్కడ నుంచి నీళ్లు వస్తాయో ఎవరికీ అంతుపట్టని తెలియదు. అంతేకాదు జిల్లాలోని మణుగూరు సమీపంలోనూ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇక్కడికి కూడా టూరిస్టులు పెద్ద సంఖ్యలోనే వస్తుంటారు. అంతేకాదు మరికొంత మంది సాహాసవంతులు ఈ కొండలను తాళ్లతో ఎక్కేందుకు ట్రై చేస్తుంటారు.

Kmm1ప్రస్తుతం ఏజెన్సీల్లో కురుస్తున్న వర్షాలతో ఈ జలపాతాల ప్రవాహం ఉధృతంగా ఉంది. ఈ అందాలను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది తరలివస్తున్నారు. ఇంతటి అద్భుతమైన టూరిస్ట్ స్పాట్ గా ఉన్న ఈ ప్రాంతం గురించి చాలా మందికి తెలియదు. ఈ జలపాతాల దగ్గర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంపై టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఈ వాటర్ ఫాల్స్ దగ్గర సౌకర్యాలు ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుందంటున్నారు. పర్యాటకశాఖ ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని కోరుతున్నారు స్థానికులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy