వింటర్ టిప్స్: పొడి చర్మానికి కొకోవా బటర్‌

చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు వస్తుంటాయి. వీటి బారి నుంచి చర్మాన్ని రక్షించుకునేందుకు కోల్డ్ క్రీములను ఉపయోగిస్తుంటాము. చలికాలం రావడంతో మార్కెట్లోకి రకరకాల కోల్డ్ క్రీములు ఎంటరవుతాయి. వీటిలో కొన్ని చర్మానికి హాని కూడా కలిగిస్తాయి. డాక్టర్ల సూచలనతో కోల్డ్ క్రీములను యూజ్ చేస్తే మంచిది.

ముఖ్యంగా పొడిచర్మం ఉన్నవారు చలికాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పొడిబారడం,దురద,పగుళ్ల సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి బయటపడటానికి లోషన్లు,కోల్డ్‌ క్రీములూ వాడుతుంటాం .అయినా పెద్దగా ఫలితం ఉండదు. బయట దొరికే క్రీముల్లో రసాయనాలు ఎక్కువగా ఉండటంతో చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాంటి వారికి కొకోవా బటర్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫ్యాటీ ఆమ్లాలు చర్మానికి తగిన పోషణ అందిస్తూ తేమగా ఉండేలా చేస్తాయి. అంతేకాకుండా ఎక్కువ సేపు చర్మం పొడిబారకుండా కాపాడుతుంది కొకోవా బటర్. అదేవిధంగా ఎండిపోయిన పెదాలకు కూడా కొకోవా బటర్‌ గానీ దాని నుంచి తయారైన ప్రొడక్స్ట్ వాడితే మంచిది. ఈ కాలంలో మరో సమస్య స్కిన్‌ దురదపెట్టడం. తక్కువ టెంపరేచర్‌ కారణంగా చర్మం పొడిగా మారి దురద, మంటపెడుతుంది. అలాంటప్పుడు స్కిన్‌ను నార్మల్ గా తీసుకురావడానికి కూడా కొకోవా బటర్‌ బాగా పనిచేస్తుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy