వింబుల్డన్‌ ప్రైజ్‌మనీ రూ. 309 కోట్లు

wimbledonవింబుల్డన్‌ ప్రైజ్‌మనీ భారీగా పెరిగింది. 2018 టోర్నీకి మొత్తం ప్రైజ్‌మనీ సుమారు రూ. 309 కోట్లుగా ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ ప్రకటించింది. గతేడాది రూ. 287 కోట్లుగా ఉంటే… ప్రస్తుతం 7.6 శాతం ఎక్కువైంది. ఈ ఏడాది మెన్స్ ,ఉమెన్స్ సింగిల్స్‌ విజేతలు సుమారు రూ. 20.5 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీని అందుకోనున్నారు. కొందరు ప్లేయర్లు గాయాల కారణంగా తొలిరౌండ్‌ మధ్యలోనే వైదొలుగుతున్న కారణంగా 50-50 రూల్‌ను సరికొత్తగా ప్రవేశపెట్టారు.  కాలుష్య నివారణకు ప్లాస్టిక్‌ స్ట్రాలను కూడా నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.

 

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy