వింబుల్డన్ లో నాదల్ సరికొత్త రికార్డు

NADALటెన్నిస్ చరిత్రలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు రఫెల్ నాదల్. వింబుల్డన్ టోర్నీలో ఆడుతున్న నాదల్… 6 – 1, 6 – 3, 6-2 తేడాతో  ఆస్ట్రేలియన్ ప్లేయర్ మిల్మాన్ పై గెలుపొందాడు. దీంతో 850 మ్యాచ్ లలో విజేతగా నిలిచిన ఏడో ఆటగాడిగా ఘనత సాధించాడు. గత రెండేళ్లుగా గ్రాస్‌ కోర్టుకు దూరంగా ఉన్న నాదల్.. ఈ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. ఫోర్ హ్యాండ్ షాట్లతో ఆసీస్ ఆటగాడిని చెడుగుడు ఆడుకున్నాడు. గాయం కారణంగా 2016 వింబుల్డన్‌కు నాదల్‌ దూరమయ్యాడు. అయితే వింబుల్డన్‌ ద్వారా ఈ సీజన్‌ ను ప్రారంభిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందని.. బాగా ఆడి విజయం సాధించాలన్న తపనతోనే ఆట ప్రారంభించానని అంటున్నాడు ఈ క్లే కోర్టు కింగ్. రెండో రౌండ్లో నాదల్‌ ఆస్ట్రేలియాకు చెందిన మరో ప్లేయర్ డొనాల్డ్‌ యంగ్‌తో తలపడనున్నాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy