లాడెన్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వనన్న అమెరికా

3_reasons_why_the_Osama_bin_Laden_assassination_story_stinks_Conspiracyclub_-_2015-01-05_19.58.17

వికీలీక్స్ మరో సంచలనం 

లాంగ్ గ్యాప్ తర్వాత… వికిలీక్స్ సంచలన వార్త మోసుకొచ్చింది. ఈ సారి కూడా పెద్దన్న అమెరికాపైనే ఫోకస్ చేసింది.  చాన్నాళ్ల తర్వాత… ఒసామా

wikileaks

బిన్ లాడెన్ ను వార్తల్లోకి తెచ్చింది. అతని డెత్ సర్టిఫికేట్ కోసం వారసులు… చేసిన రిక్వెస్ట్ ను యూఎస్ రిజెక్ట్ చేసిన విషయాన్ని బయటపెట్టింది.

ఆల్ ఖైదా చీఫ్, 9/11 ట్విన్ టవర్స్ పేలుళ్ల మాస్టర్ మైండ్ ఒసామా బిన్ లాడెన్… డెత్ సర్టిఫికేట్ కోసం అతని వారసులు సీరియస్ గా ట్రై చేస్తున్నారు. తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం కోసం లాడెన్ కొడుకు… అబ్దుల్లా బిన్ లాడెన్… సౌదీ అరేబియా రాజదాని రియాద్ లోని… యూఎస్ ఎంబసీకి లెటర్ రాశాడు. అయితే అతని రిక్వెస్ట్ ఎంబసీ రిజెక్ట్ చేసింది. డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించిన 60వేల పేజీల డాక్యుమెంట్లను వికిలీక్స్ వెలుగులోకి తెచ్చింది. 2011 మే 2న పాకిస్థాన్ లోని అబోటాబాద్ లో లాడెన్ అమెరికా బలగాలు చంపేశాయి. అతని డెడ్ బాడీని సముద్రంలో సమాధి చేసినట్టు… అమెరికన్ అధికారులు అనౌన్స్ చేశారు. లాడెన్ చనిపోయిన నాలుగు నెలల తర్వాత 2011 సెప్టెంబర్ 9న అతని డెత్ సర్టిఫికేట్ కోసం… కొడుకు అబ్దుల్లా బిన్ లాడెన్ యూఎస్ ఎంబసీకి దరఖాస్తు చేశాడు. నాటి పత్రాలనే వికిలీక్స్ తాజాగా బయటపెట్టింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే… డెత్ సర్టిఫికేట్ రిక్వెస్ట్ రిజెక్ట్ చేసినట్టు… రియాద్ లోని యూఎస్ ఎంబసీ రిప్లై ఇచ్చింది. మిలిటరీ ఆపరేషన్ లో చనిపోయిన వారికి సంబంధించి… ఎలాంటి డాక్యుమెంట్స్ గానీ, సర్టిఫికేట్స్ కాని ఇవ్వబడవని క్లారిటీ ఇచ్చింది. అయితే డెత్ సర్టిఫై కోసం వేరే విధానం ఉందని తెలిపింది. డెత్ సర్టిఫికేట్ ఇవ్వలేనందుకు ప్రతిగా… అమెరికాలోని ఓ కోర్టు… లాడెన్ చనిపోయాక… అతనిపై ఉన్న క్రిమినల్ కేసులను… డ్రాప్ చేసిన పత్రాలను పంపించింది. దానినే… డెత్ ప్రూఫ్ గా భావించాలని సూచించింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy