విక్రమ్ పై కాల్పులు : రెండు బుల్లెట్లు.. ఎన్నో ప్రశ్నలు

vikram-siteమాజీ మంత్రి ముఖేశ్ గౌడ్ కుమారుడు కాంగ్రెస్ యువ నాయకుడు విక్రమ్ గౌడ్ ఇంట్లో కాల్పులపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బంజారాహిల్స్ లోని హఫీజ్ బాబానగర్ లోని ఆయన ఇంట్లోనే ఈ కాల్పులు జరగటం సంచలనం అయ్యింది. అసలు కారణాలు తెలియడం లేదు. ప్రస్తుతం విక్రమ్ పరిస్థితి నిలకడగా ఉన్నా.. ఆయన మాట్లాడే పరిస్థితుల్లో లేరు.

ఆయన భార్య చెప్పిన వివరాల ప్రకారం.. బ్రహ్మ ముహూర్తం ఉండడంతో శుక్రవారం(జూలై 28) తెల్లవారుజామున గుడికి లేదా దర్గాకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు విక్రమ్ దంపతులు. గురువారం రాత్రి బయటకు వెళ్లిన విక్రమ్ అర్థరాత్రి దాటిన తర్వాత రెండున్నర ప్రాంతంలో ఇంటికి వచ్చారు. ఆ సమయంలోను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని.. భార్యతో పాటు బయటకు వెళ్లడానికి రెడీ అయ్యారు. అయితే తెల్లవారుజామున 3 గంటల 30నిమిషాల సమయంలో కింద హాల్ నుంచి ఒక్కసారిగా శబ్దం వచ్చింది. కాల్పులు వినిపించాయి. పై ఫ్లోర్ లో ఉన్న భార్య వచ్చి చూసేసరికి విక్రమ్ కింద పడి ఉన్నాడు. చేతిలో, కడుపులోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. సోఫాలో రక్తపు మరకలు కనిపించాయి.

షాక్ నుంచి తేరుకుని.. వెంటనే అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లింది భార్య. ఈ విషయాలనే పోలీసులకు సమాచారమందించారు విక్రమ్ భార్య. పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాడికి వాడిన గన్ కు లైసెన్స్ లేనట్టు తెలిపారు పోలీసులు. వెస్టజోన్ డీసీపీ వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.

ఈ ప్రశ్నలకు బదులేది..?

… విక్రమ్ కాంగ్రెస్ నాయకుడు. అనుచరగణం, సెక్యురిటీ ఉండే వాళ్లలో ఒకరు. అలాంటి నాయకుడిపై కాల్పులు జరిపినప్పుడు ఎవరూ లేరా? వాచ్ మెన్ ఏం చేస్తున్నాడు.

… విక్రమ్ గౌడ్ ఇల్లు చూస్తే చాలా పగడ్భందీగా ఉంది. ఇంటికి సోలార్ సెక్యూరిటీ కూడా ఉంది. అంత అర్థరాత్రి ఇంట్లోకి ఎలా వచ్చాడు. ఎటు నుంచి వచ్చారు దుండగులు. కాల్పులు జరిపిన తర్వాత ఎలా పారిపోయారు.

… ఇంటి చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఎందుకు పని చేయటం లేదు?

… గుడికి వెళ్తున్న సమయంలో విక్రమ్ దంపుతుల మాత్రమే ఉన్నారా? వారితో ఇంకెవరైనా ఉన్నారా? ఇంట్లో పని వాళ్లు లేరా.. ఉంటే వాళ్లు ఏం చెబుతున్నారు?

… ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఉన్నాయని వాదన కూడా వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంత. కుటుంబ సభ్యులు అసలు విషయాన్ని ఎందుకు దాస్తున్నారు?

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy