విచక్షణ లేని ఫాదర్… బాప్టిజం పేరుతో హింసించాడు.. వైరల్ వీడియో

పిల్లలకు అక్షరాభ్యాసం ఒక్కో మతంలో ఒక్కోలా ఉంటుంది. ఏ మతమైనా… మానవత్వాన్ని మరిచిపొమ్మని మాత్రం చెప్పదు. వెస్ట్రన్ కంట్రీస్ లో రెండు మూడేళ్ల వయసులోనే పిల్లలకు జ్ఞాన స్నానం చేయిస్తుంటారు. పసిపిల్లల నుదుటిపై నీళ్లు చల్లడం ఒక పద్ధతి. వారి నుదురును నీళ్లలో ముంచి తీయడం మరో పద్ధతి. అలా చేస్తే వాళ్లు పవిత్రులు అవుతారని ఓ నమ్మకం. అలా చేసినప్పటినుంచే… వాళ్లకు చర్చిలోకి అనుమతి లభిస్తుంటుంది. ఐతే.. రష్యాలో ఓ చర్చిలో ప్రీస్ట్ మాత్రం అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.

ఈ వీడియోను చూసి మానవత్వం ఏమైనా ఉందా అతడికి అనుకుంటున్నారు. ఓ పెద్ద పాత్రలో నీళ్లను పోసి… రెండేళ్ల పాపను అందులో అత్యంత పాశవికంగా.. ముంచితీస్తూ బాప్టైజ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఆ సమయంలో పాప బాగా ఏడుస్తోంది. నోట్లోంచి నీళ్లు కక్కి బాధపడింది. ఐనా… ఆ ప్రీస్ట్ అలాగే కరకుగా వ్యవహరించాడు. సౌత్ వెస్ట్ రష్యాలోని యెస్సెంటుకి నగరంలో ఈ సంఘటన జరిగింది. పిల్లలపై అతీత శక్తులు, దెయ్యాలు పట్టి ఉంటాయని… వాటిని వదిలించడానికి.. బాప్టైజ్ చేసేటప్పుడు కొంత కరకుగానే వ్యవహరించాల్సి వస్తుందని ఆ పర్షియన్ చర్చి ఫాదర్ చెప్పాడు. చిన్నారికి దెబ్బలు తగిలాయంటూ.. ఇలా చేస్తారా అంటూ బాధిత తల్లి మతాధికారుల ముందు గోడు చెప్పుకుంది. ఈ వీడియో ఫేస్ బుక్ లో షేర్ కావడంతో… ప్రపంచమంతా వైరల్ అవుతోంది. ఆ చర్చి యాజమాన్యం ప్రీస్ట్ పై కేసు పెట్టింది. చర్చి కోర్ట్ లో దీనిపై విచారణ నడుస్తోంది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy