విజయదశమికే కొత్త జిల్లాలు

kcr-new-districtsకొత్త జిల్లాల ఏర్పాటు చివరి దశకు చేరుకుంది. దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుపై పూర్తి ప్రకటన వెలువడే అవకాశముంది.  13 కొత్త జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్టు సమచారం. మంచిర్యాల (కొమురంభీం), జగిత్యాల, భూపాలపల్లి (ఆచార్య జయశంకర్), మహబూబాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, సూర్యాపేట, యాదాద్రి(భువనగిరి), కొత్తగూడెం, సికింద్రాబాద్ లను జిల్లాలుగా ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న రంగారెడ్డి జిల్లాను వికారాబాద్ కేంద్రంగా పునర్వవ్యస్థీకరించింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాత జిల్లాల భౌగోళిక స్వరూపంలో మార్పులు చోటు చేసుకున్నాయి. అందుకు వీలుగా మొత్తం 23 జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే మండలాల జాబితాతో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. కొత్తగా 74 మండలాలను ఏర్పాటు చేయనుంది. దీనికనుగుణంగానే గెజిట్ నోట్ విడుదల చేయడానికి రెడీ అవుతోంది సర్కార్. ప్రధాని పర్యటన ముగియగానే… అఖిలపక్షం ఏర్పాటు చేసే అవకాశముంది. ఆ సమావేశంలో వచ్చే సూచనలు, సలహాలు తీసుకుని.. మార్పులు చేర్పులు చేస్తారని చెబుతున్నారు అధికారులు. కృష్ణా పుష్కరాలు 12న ప్రారంభం కానున్నాయి కాబట్టి.. దాని కంటే ముందే అంటే 11న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది.  నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత గెజిట్ విడుదల చేయడానికి 60 రోజుల సమయం ఉండాలని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ సారి దసరా పండుగ అక్టోబర్ 11న వస్తోంది. ఆ లోపే జిల్లాల పునర్విభజన ప్రక్రియ పూర్తయి, దసరా పండుగ రోజున నూతన జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించాలంటే.. ఈ నెల 10లోపు కసరత్తును పూర్తి చేయాల్సి ఉంటుందని అంటున్నారు.

జిల్లా పరిపాలనకు కావాల్సిన సిబ్బందిని, తాత్కాలిక కార్యాలయాలకు అనువైన స్థలాన్ని కూడా ఈ మేరకు గుర్తించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. పేపర్‌వర్క్ పూర్తయిందని, నిర్ణయం వెలువడిన వెంటనే దానిని అమలు చేయడానికి కార్యాచరణ సిద్ధంగా ఉందంటున్నారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy