యాదాద్రి విస్తరణ పనులు రేపే ప్రారంభం

Yadadri Webయాదాద్రి విస్తరణ పనులకు ముహూర్తం ఖరారైంది. దసరా రోజున పనులు ప్రారంభిస్తున్నారు. వేద పండితులు నిర్ణయించిన సమయానికి సరిగ్గా పనులు మొదలుపెట్టనున్నారు. మధ్యలో బ్రేక్ లేకుండా విస్తరణ పనులు ఒకే సారి కంప్లీట్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు..

విజయదశమిరోజున ప్రారంభం కానున్న పనులు… మొదట ఆలయానికి దక్షిణ దిశలో ప్రహరీగోడ నిర్మాణంతో విస్తరణకు శ్రీకారం చుట్టనున్నారు అధికారులు. రేపు ఉదయం  సరిగ్గా 10 గంటల 50 నిమిషాల నుంచి 11 గంటల మధ్య శ్రవణా నక్షత్రాన ఆలయ విస్తరణ పనులకు తొలిపూజ జరపనున్నారు వేద పండితులు. ప్రత్యేక పూజల తర్వాత పనులు  మొదలుపెడతారు. కొండపై దేవాలయ సన్నిధిలోని బ్రహ్మోత్సవ కల్యాణ మండపం దగ్గర శంకుస్థాపన శిలాఫలకం వేస్తున్నారు.  రేపటి నుంచి ప్రారంభమయ్యే పనులు బ్రేక్ లేకుండా కంటిన్యూగా జరగనున్నాయి. పనులు పూర్తయ్యే వరకు  అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తారు.

విస్తరణ పనుల్లో దేవాలయ గర్భగుడితో పాటు క్షేత్రపాలకుడి ప్రాంగణంలో ఎలాంటి మార్పులు చేయడం లేదు. రామానుజ కూటమి, నిత్య కల్యాణ మండపం, యాగశాల, ప్రవచన మండపాలు, రాజగోపురాలు, మాడవీధులు  నిర్మిస్తున్నారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి ఇచ్చిన ప్లాన్ ప్రకారం పనులు పక్కాగా జరుపుతామంటున్నారు అధికారులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy