విజయవాడలో తొలి మహిళా పార్లమెంట్ సదస్సు

kavithaదేశంలోనే ఫస్ట్ టైం జరుగుతున్న మహిళా పార్లమెంట్ సదస్సుకు విజయవాడ వేదికైంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ప్రపంచ మహిళా సాధికారత ఎజెండాగా ఈ సదస్సు జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం…AP అసెంబ్లీ సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. మూడు రోజుల పాటు జరగనున్న సదస్సుకు పలువురు కేంద్ర మహిళా మంత్రులతో పాటు… రాష్ట్రాల మంత్రులు హాజరుకానున్నారు. వీరితో పాటు బంగ్లాదేశ్, అఫ్రికా, అమెరికా దేశాల నుంచి కూడా ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతారు. సదస్సును లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ప్రారంభించనున్నారు.

APలోని ప్రతి కాలేజీ నుంచి ఇద్దరు విద్యార్థినిలు…. ప్రతి యూనివర్సిటీ నుంచి ఒక్కో బృంధం ఈ సదస్సులో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఉదయం ప్రముఖ మహిళల ప్రసంగాలు ఉంటాయి. మధ్యాహ్నం పలు సమస్యలపై చర్చిస్తారు. ఇందుకోసం రెండు వేదికలను రెడీ చేశారు అధికారులు. మరోవైపు వంద కాలేజీల నుంచి స్టూడెంట్స్ లైవ్ లో పాల్గొంటారు. స్టూడెంట్స్ ప్రశ్నలకు ప్రముఖులు సమాధానం ఇవ్వనున్నారు. ఈ మొత్తం యూ ట్యూబ్ లో లైవ్ లో ప్రసారం కానుంది.

రాష్ట్రం నుంచి మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరవ్వనున్నారు MP కవిత. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సులో చర్చించనున్నట్టు చెప్పారు. రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ అమలు చేసినప్పుడే సరైన న్యాయం జరుగుతుందన్నారు కవిత.

మహిళా పార్లమెంట్ సదస్సుకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందుకు కలగకుండా ప్రత్యేక ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy