విజయా బ్యాంకు లో ఉద్యోగాలు

vijayaవిజయాబ్యాంక్ లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. MMG స్కేల్-2లో మేనేజర్ చార్టర్డ్ అకౌంటెంట్, మేనేజర్ లా, మేనేజర్ సెక్యూరిటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

 

బ్యాంక్ పేరు: విజయా బ్యాంక్

పోస్టు పేరు: మేనేజర్

ఖాళీల సంఖ్య: 57

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా

జీతం వివరాలు: రూ. 31,705- 45,950/-

విద్యార్హత: మేనేజర్ కార్టర్డ్ అకౌంటెంట్ అభ్యర్థులు చార్టర్డ్ అకౌంటెంట్ ఫైనల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. మేనేజర్ లా అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎల్(ఎల్ఎల్‌బీ)(రెగ్యూలర్ ఫుల్‌టైమ్ ) చేసివుండాలి. మేనేజర్-సెక్యూరిటీ అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఏజ్ లిమిట్: 01.03.2018 వరకు మేనేజర్ చార్టర్డ్ అకౌంటెంట్, మేనేజర్ లా అభ్యర్థులు 20-35ఏళ్లు, మేనేజర్ సెక్యూరిటీ అభ్యర్థులు 20-45ఏళ్లు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం SC,ST 05 ఏళ్లు,OBCలకు 03,PWD వారికి 10 ఏళ్ల ఏజ్ సడలింపు ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ: గ్రూప్ డిస్కషన్/రాత పరీక్ష పర్సనల్ ఇంటర్వ్యూ డెబిట్ లేదా క్రెడిట్/నెట్ బ్యాంకింగ్ ద్వారా అభ్యర్థులు ఫీజు చెల్లించవచ్చు. SC,ST, PWD రూ.100 చెల్లించాలి.OBCతో పాటు మిగిలినవారంతా రూ.600 ఫీజు చెల్లించాలి.

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 12.04.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 27.04.2018

వెబ్ సైట్: https://www.vijayabank.com/images/fckimg/file/Recruitment/Ad
vertisement%20Specialist%20officers.pdf

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy